top of page
MediaFx

కాకులపై యుద్ధం ప్రకటించిన కెన్యా ప్రభుత్వం 10 లక్షల కాకులను చంపేందుకు ప్లాన్‌!


కెన్యా ప్రభుత్వం 10 లక్షల భారతీయ కాకులను చంపాలని నిర్ణయించింది. ఈ కాకులు కెన్యాకు ఎంత కష్టం తెచ్చాయో తెలుసుకోండి!

కెన్యా కాకులతో యుద్దం ప్రారంభించింది. భారతదేశం నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ఈ కాకులు కెన్యా పర్యావరణం, పరిశ్రమలకు విపరీతమైన నష్టం కలిగిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా కాకుల సంఖ్య తగ్గించడానికి ప్రయత్నిస్తున్న కెన్యా, ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసింది. సుమారు 10 లక్షల కాకులను అంతమొందించేందుకు సిద్ధమైంది.

భారతదేశం నుంచి వచ్చిన కాకుల సంఖ్య కెన్యాలో విపరీతంగా పెరిగిపోయింది. దీంతో అవి ఎక్కడ చూసినా కనిపిస్తూ, మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఆహారాన్ని దొంగలించడం, పంట నష్టం కలిగించడం, స్థానిక పక్షులను వెంటాడటం వంటి కారణాలతో కెన్యా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

కెన్యా ప్రజలతో పాటు వ్యాపారవేత్తలు కూడా ఈ కాకులపై కంప్లైంట్లు చేస్తున్నారు. తమ పరిశ్రమలను కాకులు దెబ్బ తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ ప్రేమికులు కూడా ఈ కాకుల కారణంగా పర్యావరణం దెబ్బతింటోందని, చిన్న స్థానిక పక్షులు తగ్గిపోతున్నాయని మండిపడుతున్నారు.


bottom of page