top of page
MediaFx

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా..


తెలుగు మంచి క్రేజ్ ఉన్న బ్యూటీస్ లో కీర్తి సురేష్. ఆ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎక్కువగా గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ.. సినిమాలను ఎంచుకుంటుంది. తన నటనతో ఆడియన్స్ ను ఆకర్షించిన ఈ చిన్నది తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది. ఈ చిన్నది ఇప్పుడు ఈ బ్యూటీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అక్కడ ఆమె హఠాత్తుగా గ్లామర్ అవతార్ లో దర్శనమించి షాక్ ఇచ్చింది. ఇందుకు సంబందించిన ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ లో వరుణ్ ధావన్‌కి జోడీగా కీర్తి సురేష్ ‘బేబీ జాన్’ అనే సినిమాలో నటిస్తోంది . ఈ సినిమా షూటింగ్ సెట్‌లోని కొన్ని ఫోటోలు వైరల్‌గా మారాయి.

వరుణ్ ధావన్ పుట్టినరోజును ఇటీవల ‘బేబీ జాన్’ సెట్స్‌లో జరుపుకున్నారు. అదే రోజు పాట షూటింగ్ కూడా జరిగిందని తెలుస్తోంది. ఇందులో కీర్తి సురేష్, వరుణ్ ధావన్ పాల్గొన్నారు. షూటింగ్ విరామంలో వరుణ్ ధావన్ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ టైం లో తీసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా కీర్తిసురేష్ గ్లామర్  లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ‘మహానటి’ చిత్రంలో అలనాటి నటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాకు జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఆ తర్వాత మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమాలోని పాటలో కాస్త గ్లామర్ గా కనిపించింది. ఇప్పుడు బాలీవుడ్ లో ఫుల్ గ్లామర్ గెటప్ లో అభిమానులకు కిక్ ఇచ్చింది. ‘బేబీ జాన్’ తమిళ చిత్రం ‘తేరి’కి హిందీ రీమేక్. ఒరిజినల్ సినిమాలో దళపతి విజయ్ పోషించిన పాత్రను వరుణ్ ధావన్ పోషిస్తున్నాడు. ‘తేరి’ సినిమాలో సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా నటించింది. హిందీలో కీర్తి సురేష్ ఆ పాత్రను చేస్తోంది. అట్లీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.


bottom of page