సినిమా న్యూస్‌లతో కంటే.. తన పెళ్లి వార్తలతోనే నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతుంటారు కీర్తి సురేష్. ఆ న్యూస్‌ల కారణంగా చాలా సార్లు తలపట్టుకుని ఇబ్బంది కూడా పడ్డారు. ఎన్నో సార్లు అవి ఫేక్ న్యూసంటూ.. తాను ఎవర్నీ పెళ్లి చేసుకోవడం లేదంటూ చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఎంతకీ తన పెళ్లి న్యూస్‌లు ఆగకపోవడంతో.. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. తాజాగా తన సైలెంట్‌ను బ్రేక్ చేస్తూ.. తన పెళ్లి వార్తలపై తన ఆన్సర్ ఏంటో చెప్పారు. ఈ క్రమంలోనే ఓ అబ్బాయితో దిగిన ఫోటో కారణంగా మళ్లీ ఫ్రెష్‌గా .. పెళ్లి రూమర్స్ తో నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ బ్యూటీ. ఎట్ ప్రజెంట్ డైరెక్టర్ సుమన్ కుమార్ డైరెక్షన్లో రఘుతాత సినిమా చేస్తున్నారు కీర్తి సురేష్. ఇక ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా.. తన ఫ్యాన్స్‌తో మాట్లాడారు ఈ బ్యూటీ.. ఈ క్రమంలోనే తన పెళ్లిపై వస్తున్న వార్తలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. తన పెళ్లి రూమర్స్ పై ప్రతిసారి క్లారిటీ ఇస్తుంటే అదే నిజమనుకుంటున్నారని.. అందుకే వాటిపై తాను రియాక్ట్ అవ్వడం మానేశా అన్నారు.
తన సినిమాల ఎంపిక.. నటనపై విమర్శలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తానని.. వాటితో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతానని అన్నారు. అలా కాకుండా.. తన వ్యక్తిగత జీవితం.. ఫ్యామిలీ గురించి ఎవరైనా కామెంట్స్ చేసినా అస్సలు పట్టించుకోనంటూ చెప్పారు. అయితే కీర్తి చేసిన ఈ కామెంట్స్ ఓ పక్క నెట్టింట వైరల్ అవుతున్న వేళ.. తన తన ఫ్యామిలీతో కలిసి ఓ రిసార్ట్‌లో క్రికెట్ గేమ్ ఆడారు. ఆ కమ్రంలోనే తన ఫ్యామిలీ మెంబర్స్‌తో చిందులేశారు. ఈ క్రమంలోనే ఓ అబ్బాయిని పట్టుకుని కీర్తి దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోతో పాటే.. తాజా పెళ్లి రూమర్‌కి ఈ ఫోటోయే కారణం. దీంతో కీర్తి అబ్బాయిని పట్టుకుని కనిపించడమే పాపం అయిందంటూ.. ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి రూమర్స్ పై తమ అభిమాన హీరోయిన్ చెప్పిన మాటలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.