top of page
MediaFx

ఆ విషయంలో దళపతి విజయ్‌ను ఫాలో అవుతున్న కీర్తిసురేష్..


మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. అంతే కాకుండా హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే కథలో కంటిన్యూగా నటిస్తోంది. రీసెంట్ గా తమిళ్ రఘు తాత అనేసినిమాలో నటిస్తుంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సుమన్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎం.ఎస్. భాస్కర్ రవీంద్ర విజయ్, ఆనంద్ సామి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కేజీఎఫ్, కాంతార, సలార్ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ మూవీ  ప్రమోషన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నటి కీర్తి సురేష్ వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిజీగా మారిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తిసురేష్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో అభిమానులతో ముచ్చటించింది. “మీ గురించి నెగిటివ్ వార్తలు, పుకార్లు, మీమ్స్, ట్రోల్స్ మొదలైనవాటిని మీరు ఎలా ఎదుర్కొంటారు?” అన్న ప్రశ్నకు కీర్తిసురేష్ఏ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. కీర్తి సురేశ్‌ మాట్లాడుతూ.. ‘‘ దళపతి విజయ్‌ సార్‌ దీని గురించి చాలా సార్లు మాట్లాడారు. అంటే నిజానిజాలు వివరిస్తే తేలిపోతుంది. అదే రూమర్‌కి వివరణ ఇస్తే అది నిజమే అవుతుంది. ఆయన చెప్పింది పూర్తిగా నిజం. మనకు అవసరం లేని వాటిపై మన శక్తిని వృధా చేసి వివరించకూడదనుకుంటే, నేను చేయను అని తెలిపింది కీర్తి. ఈ వీడియో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

bottom of page