top of page
Shiva YT

🎉 జనగామ, భువనగిరిలో కేసీఆర్ సభలు..

18లో హుస్నాబాద్‌ నుంచే కేసీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అద్భుత విజయం సాధించారు. 🌟 అదే సెంటిమెంట్‌ రిపీట్‌ చేయాలంటూ తాజాగా హుస్నాబాద్‌ నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు గులాబీ దళపతి. 🌷

గులాబీ గర్జనతో హుస్నాబాద్‌ హుషారెత్తిపోయింది. 📣 తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లామన్నారు సీఎం కేసీఆర్. 🌆 95 నుంచి 105 సీట్లు BRS గెలిచేందుకు హుస్నాబాద్‌ వేదిక కావాలన్నారు ముఖ్యమంత్రి. 💺 తెలంగాణను నెంబర్‌ వన్‌ స్థానానికి తీసుకెళ్లామని, పారిశ్రామిక విధానంలో మనకు పోటీ, సాటి మరెవరూ లేరన్నారు కేసీఆర్. 💼 పెన్షన్‌ రూ.5000లకు పెంచబోతున్నామని, రైతుబంధును దశలవారీగా రూ.16,000లకు పెంచబోతున్నారు. 💰 హుస్నాబాద్‌ ఆశీర్వాదంతో 2018లో 88 సీట్లతో ఘనవిజయం సాధించామన్నారు సీఎం కేసీఆర్. 🏆

ఇక ఇవాళ జనగామ, భువనగిరి సభల్లో ప్రసంగించనున్నారు సీఎం కేసీఆర్‌. 🎤 ముఖ్యంగా జనగామ పాలిటిక్స్‌ కొంతకాలంగా రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారాయి. 🔥 సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కాదని, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అక్కడ టికెట్‌ ఖరారు చేశారు. 📃 అంతేకాకుండా సుమారు 4 దశాబ్దాల పాలనలోకి కాంగ్రెస్‌ పార్టీకి సేవలందించిన పొన్నాల..కొన్ని అనూహ్య పరిణామాల వల్ల ఆ పార్టీని వీడారు. పొన్నాల రాజీనామా ఎపిసోడ్‌ అందర్నీ ఆలోచనలో పడేసేలా చేసింది. 📺 అదే జరిగితే వేదికపై నుంచే సీఎం కేసీఆర్‌ పొన్నాలకు ఏమని హామీ ఇస్తారనేది ఆసక్తి రేపుతోంది. 📰✨

bottom of page