top of page

‘కేసీఆర్‌‌కు సర్జరీ కారణంగా ప్రమాణం చేయలేకపోతున్నా..’

👩‍⚕️ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంతో తెలంగాణ మూడో అసెంబ్లీ తొలి సమావేశం ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన సీనియర్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ కొత్త సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.

తొలుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన తర్వాత డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఆ తర్వాత సీతక్క, ఆ తర్వాత వరుసగా మిగిలిన మంత్రులు ప్రమాణం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. ఈ క్రమంలో శాసనసభ కార్యదర్శికి మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ కు సర్జరీ కారణంగా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయలేకపోతున్నానని మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్‌ తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు మరో రోజు అవకాశం ఇవ్వాలని ఆయన శాసనసభ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. ‘‘దురదృష్టవశాత్తూ మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితి కారణంగా నేను ఈరోజు BRS శాసనసభ సమావేశానికి, శాసనసభలో ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోయాను. ఈరోజు హాజరుకాని మరో 4-5 మంది ఎమ్మెల్యేలతో కలిపి ప్రమాణ స్వీకారానికి మరో తేదీని కేటాయించాలని అసెంబ్లీ సెక్రటరీ కోరాను.’’ అంటూ కేటీఆర్ ఎక్స్ లో షేర్ చేశారు.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page