top of page
Shiva YT

🚨🔥 ఇవాళ మహారాష్ట్ర కొల్లాపూర్‌కు సీఎం కేసీఆర్‌..🔥🚨

🔍 కేసీఆర్‌ మహారాష్ట్రలో వ్యూహాత్మక దండయాత్ర చేపట్టారు. ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా భారీ బలగంతో మరాఠా గడ్డపై అడుగుపెట్టడం.. అక్కడి ఆలయాలను సందర్శించడం.. ప్రముఖ మరాఠ యోదులను, కవులను తమ పార్టీ వైపుకు ఆకర్శించడం. మిషన్‌ 2024 దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. మహారాష్ట్రపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్పెషల్ ఫోకస్ పెట్టారు. 🎯

అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌ పేరుతో ఇప్పటికే మహారాష్ట్రలో బీఆర్ఎస్‌ నెమ్మదిగా ఎంట్రీ ఇచ్చింది. మహారాష్ట్రలోని నాందేడ్, కంధార్ లోహాలో బీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వహించింది. ఆయా సభలకు ప్రజలు పెద్దయెత్తున హాజరుకావడంతో బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరింత దూకుడు పెంచారు. 🚀 ఇందులో భాగంగా అక్కడ తమ పార్టీ కార్యకలాపాలను పెంచుకుంటోంది. ఇందులో భాగంగా తానే రంగంలోకి దిగారు. బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(సీఎం కేసీఆర్) మంగళవారం మహారాష్ట్రలో పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రగతి భవన్ నుంచి నేరుగా ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు. కొల్లాపూర్‌ విమానాశ్రయానికి 11.15 గంటలకు చేరుకుంటారు. 🛫 విమనాశ్రయం నుంచి నేరుగా కొల్లాపూర్‌లోని అంబాబాయి దేవాలయానికి చేరుకుంటున్నారు. ఆలయంలో అమ్మవారికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. 🙏 అలాగే మధ్యాహ్నం 12.45 గంటలకు అన్నాభావు సాఠే వర్ధంతి పాల్గొంటారు.

bottom of page