📅📃మొదటి నుంచి కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు పెట్టీ ప్రత్యెక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం అందరికి తెలిసిందే. 🙏📜
కొనాయపల్లికి సీఎం కేసీఆర్ వస్తుండడంతో పోలీస్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు. 🚓👮♂️ హెలిప్యాడ్ కోసం స్థలం సిద్దం చేశారు. 🚁✅ ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలలో రెండు చోట్ల కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. 📆📋 ఇదిలా ఉంటే కేసీఆర్‌కు ఈ ఆలయం ఇప్పటి సెంటిమెంట్ కాదు. 🙌💐 ఏళ్లనాటి నుంచి ఇదొక ఆనవాయితీగా వస్తోంది. 1985లో మొదటిసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం 1989, 94, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో పోటీ చేసిన ఎన్నికల్లో కూడా ఈ ఆలయంలోనే నామినేషన్ పత్రాలకు పూజ చేసి నామినేషన్లు దాఖలు చేశారు. 🗳️🙏
📆📃అంతేకాకుండా 2001లో డిప్యూటీ స్పీకర్ పదవికి టిడిపి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించినప్పుడు కూడా ఈ ఆలయంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. 🌟📆 ఇలా ప్రతి ముఖ్యమైన కార్యక్రమాన్ని మొదలు పెట్టేముందు ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయడం కేసీఆర్‌కు ఆనవాయితీ, ఇప్పటికే కేసీఆర్ ఫామ్ హౌస్‌లో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. 🌞🙏 శుక్రవారంతో ఈ యాగం పూర్తవుతుంది, ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం కోనాపూర్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈనెల 9వ తేదీన గజ్వేల్ కామారెడ్డి అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లను దాఖలు చేయనున్నారు. 📜🗳️