top of page

📢 ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు మరో శుభవార్త.. 🎉

తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పీఆర్సీ 2021 జూన్‌ 1వ తేదీ నుంచి పీఆర్సీ వర్తిస్తుందని సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ తెలిపింది. 📅

ఇదిలావుంటే.. పీఆర్సీ అమలుకు కావాల్సిన చర్యలను వెంటనే తీసుకోవాలని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌కు తెలంగణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 📜

ఈ విభాగంలో మొత్తం 583 మంది కళాకారులతో తెలంగాణ సాంస్కృతిక సారథిని 2014 సెప్టెంబర్ 30న ఏర్పాటు చేసింది. 🗓️ రాష్ట్రం ఏర్పండిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యోమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు ఉద్యోగాలకు కల్పించింది. 🌟 ఇందులో మొత్తం 550 మంది కళాకారులు ఉద్యోగాలు దక్కించుకున్నారు. వీరిలో 319 మంది ఎస్సీలు, 38 మంది ఎస్టీలున్నారు. 🎭 ఇందులో పనిచేస్తున్న కళాకళాకారులకు ప్రభుత్వం నిధి నుంచి జీతాలను అందిస్తోంది. 💰

ప్రస్తుతం పే స్కేలు మీద 30 శాతం పీఆర్సీని అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉద్యోగుల పేస్కేలు 24,514 ఉండగా.. నూతన పీఆర్సీ ప్రకారం జీతభత్యాలు ఒక్కొక్కరికీ రూ. 7,300 మేర పెరగనుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 💪👏


Opmerkingen


bottom of page