top of page

కేసీఆర్ సర్కారుకు హైకోర్టు దిమ్మ తిరిగే పంచ్

మైకు ముందుకు వస్తే చాలు గొప్పగొప్ప కలల్ని. అంతకు మించిన విలువల్ని.ఆశయాల్ని గుక్క తిప్పుకోకుండా చెప్పుకునే టాలెంట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతం. అలాంటి ఆయన ప్రభుత్వాన్ని నడిపించే విషయంలో వ్యవహరించే తీరు అభ్యంతరకరంగా ఉండటమే కాదు.. ఇలా కూడా ప్రభుత్వాన్ని నడుపుతారా? అన్న విస్మయాన్ని కలిగిస్తూ ఉంటారు. తాను కోరుకున్న భవనం లేనంతకాలం తెలంగాణ సెక్రటేరియట్ లో కాలు పెట్టటానికి ససేమిరా అన్న ఆయన.. తనకు నచ్చిన కొన్ని అంశాల్ని దగ్గరకు రానివ్వటానికి ఇష్టపడరు.

అంతేకాదు.. ఖాళీ అయ్యే కీలక పోస్టుల భర్తీ విషయంలోనూ అంతులేని జాప్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఎందుకిలా అంటే.. ప్రత్యేక కారణాలు ఏమీ చెప్పరు. అలా అని అర్హులైన వారు లేరా? అంటే..బోలెడంత మంది కనిపిస్తారు.అయినప్పటికీ కీలక పదవుల ఖాళీల్ని భర్తి చేసే విషయంలో గులాబీ బాస్ ప్రదర్శించే నిర్లక్ష్యం అంతుచిక్కనిదిగా ఉంటుంది. ఈ విషయాల్ని ఎవరైనా ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పకుండా దాటేసే తెంపరితనంతో పాటు.. ఎవరైనా స్పందిస్తుంటే.. ఎందుకు రియాక్టు అవుతావు బుద్ధి లేకుండా అంటూ? వారికి క్లాస్ పీకే తత్త్వం గులాబీ బాస్ లో కనిపిస్తుంది.అలాంటి అధినేతల పాలనలో కీలకమైన మానవ హక్కుల సంఘం ఛైర్మన్.. కార్యవర్గ సభ్యుల నియామకాల్ని చేపట్టలేదు. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో స్పందించింది. కీలక వ్యాఖ్యలు చేసింది.కీలకమైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్.. సభ్యుల నియామకంలో కానసొగుతున్న జాప్యాన్ని సూటిగా ప్రశ్నించింది. "రాష్ట్రం.. హక్కుల ఉల్లంఘనలు లేని స్వర్గమా?" అని సూటిగా ప్రశ్నించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్. జస్టిస్ ఎన్. తుకారంజీలతో కూడిన ధర్మాసనం సదరు పిటిషన్ పై విచారణ జరిపింది.ఈ సందర్భంగా పిటిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గత ఏడాది డిసెంబరు 22 నుంచి మానవ హక్కుల కమిషన్ కు ఛైర్మన్ కానీ.. సభ్యులు కానీ లేరని పిటిషన్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. సుమారు 6వేల కేసులు పెండింగ్ లో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.దీనిపై ప్రభుత్వం తరఫు ప్రత్యేక న్యాయవాది హరేందర్ పరిషద్ వాదనలు వినిపిస్తూ.. రెండు వారాల గడువు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం గత ఏప్రిల్ 18న ప్రభుత్వ సహాయ న్యాయవాది ఇలానే గడువు కోరి వెళ్లారని.. మళ్లీ ఇప్పుడు గడువు కోరుతున్నారన్నారు. సరైన చర్యలు లేకపోతే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమన్లు జారీ చేయాల్సి ఉంటుందన్నారు. నియామకంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ.. ఈ నెల 21కి కేసును వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.


Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page