top of page
MediaFx

కేసీఆర్‌ పార్టీ పెట్టిన ఫస్ట్‌ డే నుంచే నాశనం కావాలని కోరుకున్నారు..


కవిత జైల్లో ఉన్నారు.. నేను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ పైగా ఆమెకు అన్నను.. మరి నేను వెళ్లి ఢిల్లీలో లాయర్లను కలవద్దా? ఏం జరుగుతుందో నాలుగు రోజులు ఉండి విచారించొద్దా? ఆ పని మీద నేను వెళ్తే.. వీళ్లు బీజేపోళ్ల కాళ్లు మొక్కిండు. చీకట్లో బేరాలు చేసుకున్నాడని ప్రచారం చేస్తున్నారు. మాకేం కర్మ.. కవిత అరెస్టయి 150 రోజులు అవుతుంది.. నిజంగా చీకట్లో ఒప్పందం చేసుకుని ఉంటే.. మా ఇంటి ఆడబిడ్డ జైలులో ఉంటుండేనా?’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఒక్క కాంగ్రెస్‌ నాయకుడు అయినా జైలులో ఉన్నాడా అని అడిగారు. మరి ఎవరికి లోపాయికారీ ఒప్పందం ఉందని ప్రశ్నించారు. ప్రజల్లో లీనమై పనిచేద్దామని బీఆర్‌ఎస్‌ నాయకులకు కేటీఆర్‌ సూచించారు. ఇంకో 24 ఏండ్లు.. అవసరమైతే ఇంకో 50 ఏండ్లు ఉండేలా పార్టీని బ్రహ్మాండంగా తయారుచేసుకుందామని అన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నా సరే వాళ్ల రుణం తీర్చుకోవాలి

మనం మాయమైపోవాలని కోరుకునేటోళ్లు చాలామంది ఉన్నారని కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి.. ఈ పార్టీ ఉండొద్దని కోరుకున్నోళ్లు చాలామంది అనుకున్నారని తెలిపారు. మనం పోవాలని కోరుకున్నోళ్లు, మన పార్టీ నాశనం కావాలని అనుకునోళ్లు.. పోయిండ్రు తప్ప మనం మాత్రం మంచిగనే ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చినంక రెండు ఎన్నికల్లో మనల్నే గెలిపించారని తెలిపారు. పదేళ్లు మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్లకు రుణపడాలి ఉండాలన్నారు. వాళ్ల రుణం తీర్చుకోవాలని అన్నారు. ఇందుకోసం ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజల తరఫున కొట్లాడుతూనే ఉండాలని సూచించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వీపు చింతపండు అయితది అన్నట్టుగా వాళ్లను చైతన్యం చేసి నడిపించాలని అన్నారు.

త్వరలోనే బీఆర్‌ఎస్‌ నాయకులతో కేసీఆర్‌ భేటీ

తొందరలోనే పార్టీ కూడా కార్యక్రమాలు ఇస్తుందని బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్‌ తెలిపారు. కేసీఆర్‌ కూడా నియోజకవర్గాల వారీగా అందరినీ కలుస్తానని చెప్పారని అన్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నాయకులనే ఫస్ట్‌ కేసీఆర్‌ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పారు. త్వరలోనే ఉప ఎన్నిక వచ్చేది ఉందని.. యుద్ధానికి సన్నద్ధం కావాలని సూచించారు.

bottom of page