పాలకులు ఎర్రజెండాను తక్కువ అంచనా వేయవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు వార్నింగ్ ఇచ్చారు.ప్రభుత్వ భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలివ్వాలని, ఇల్లు లేని పేదలకు పట్టాలు ఇవ్వాలని..
నిరుపేదలకు రెండు పడకల గదులు ఇవ్వాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. కమ్యూనిస్టులు నిజాయితీగా, ధర్మం, న్యాయం కోసం నిలబడ్డారని సాంబశివరావు పేర్కొన్నారు. కమ్యూనిస్టులకు కష్టాలు వస్తాయని.. అయినా తాము పేద ప్రజలకు అండగా నిలుస్తామని సాంబశివరావు స్పష్టం చేశారు. పోరాటాలతోనే సమస్యలు సాధ్యమవుతాయన్న సాంబశివరావు.. ప్రభుత్వంపై ప్రజా సమస్యల సాధనకై పోరాటాలే శరణ్యమన్నారు. ఆ పోరాటాలకు నాయకత్వం వహించేది ఎర్రజెండా మాత్రమేనని సాంబశివరావు అన్నారు. పేదల కోసం పోరాడడమే కాకుండా ప్రభుత్వం మెడలు వంచి వారికి అండగా నిలుస్తామని సాంబశివరావు అన్నారు. గత ఎన్నికల్లో పేదలకు రెండు పడకల గదులు ఇల్లు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఆ మాటలను దాటవేయడమేంటని సాంబశివరావు మండిపడ్డారు.