top of page

ధరణి పోర్టల్ చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు.. 🌐🔄

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం మొత్తం ధరణి పోర్టల్ చుట్టూనే తిరుగుతోంది. ధరణి పోర్టల్ తీసుకువచ్చి రైతుల నడ్డి విరిచిన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు.

తాము అధికారంలోకి వస్తే రైతులకు నష్టం కలిగిస్తున్న ధరణి వెబ్ సైట్ ను తొలగిస్తామని స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వివాదాస్పద భూముల్లో పెద్ద ఎత్తున అలజడి చెలరేగిందని, యాజమానులు.. అధికారుల మధ్య యుద్దానికి కేసీఆర్ కారణం అయ్యారని విమర్శించారు. ధరణిలో లోపాలున్నాయనే భూమాతను తెస్తున్నామంటోంది కాంగ్రెస్ పార్టీ. ధరణి కారణంగా పెద్ద ఎత్తున రైతుల భూములు అధికారపార్టీ పెద్దల చేతుల్లోకి పోయాయని ఆరోపిస్తోంది. దీనికి బీఆర్ఎస్ పార్టీ బలంగానే తిప్పికొడుతోంది. ధరణి పోర్టల్ తీసేస్తే రైతులకు రైతు బంధు ఎలా వస్తుందని ప్రశ్నిస్తుంది. రైతులను ఆగం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ మాటలను తిప్పి కొట్టారు. ప్రజలు ఈ విషయాన్ని బాగా ఆలోచించాలని కోరారు. 🌍🌱🔄


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page