top of page

ప్రధాని మోదీ కటౌట్‌కు ముద్దు పెట్టిన కాశ్మీరీ..🌨️🏔️

జమ్మూ కశ్మీర్‌లో అత్యంత తీవ్రమైన శీతాకాలం ‘చిల్లై కలాన్’ ప్రారంభమైంది. స్థానిక భాషలో “చిల్లై కలాన్” అని పిలువబడే 40 రోజుల అత్యంత తీవ్రమైన చలికాలం కాశ్మీర్ లోయలో ఈరోజు (డిసెంబర్21) నుంచి ప్రారంభమైంది.

చిల్లై-కలాన్ సమయంలో ఈ ప్రాంతంలో వాతావరణం పొడిగా, చల్లగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థానం కంటే తక్కువగా ఉంటాయి. అయితే, చిల్లై కలాన్ మొదటి రోజును “అంతర్జాతీయ ఫెరాన్ దినోత్సవం” గా జరుపుకుంటారు. ఫెరాన్ దినోత్సవం సందర్భంగా జమ్మూలో కాశ్మీరీ సాంప్రదాయ ఉట్టిపడేలా రంగురంగుల ఫెరాన్ (ఉన్ని వస్త్రం) ధరించి, లాల్ చౌక్‌లోని ఘంటా ఘర్ దగ్గర పురుషులు, మహిళలు ఫెరాన్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ విగ్రహాన్ని సంప్రదాయ “ఫెరాన్”లో అలంకరించి.. 🌟🎉 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోర్ట్రెయిట్ కటౌట్ స్థానికులతోపాటు సందర్శకులకు సైతం ప్రధాన ఆకర్షణగా మారింది. ప్రధానమంత్రి చిత్రపటం వద్ద సందర్శకులు ఫొటోలు దిగుతూ సందడిచేశారు. అయితే, ఈ సందర్భంగా ఓ వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి ముద్దు పెడుతూ తన ప్రేమను చాటుకున్నాడు. ఆప్యాయతతో కౌగిలించుకుని కృతజ్ఞతలు తెలిపాడు. 💖🙌


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page