top of page
MediaFx

యష్ “టాక్సిక్” నుండి వైదొలగిన కరీనా కపూర్


కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో దేశ వ్యాప్తంగా చాలా క్రేజ్ తెచ్చుకున్న స్టార్ యాక్టర్ యష్. ఈ హీరో తదుపరి టాక్సిక్ చిత్రం లో కనిపించనున్నారు. ఫిమేల్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రం లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన కరీనా కపూర్ యష్ కి సోదరి పాత్రలో నటించనున్నట్లు గతం లో పలు వార్తలు వచ్చాయి. మేకర్స్ కరీనా కపూర్ పాత్ర కోసం బాగానే ట్రై చేసారు. అయితే ఇప్పుడు కరీనా కపూర్ ఈ చిత్రం లో నటించడం లేదని తెలిసింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కు ఈ చిత్రం కోసం సరైన కాల్షీట్లు అందుబాటులో లేవు. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం తో సినిమాను వదులు కోవాల్సి వచ్చింది. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది అని, చాలా డిఫెరెంట్ రోల్ అని ముందునుండి ప్రచారం జరుగుతుంది. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో పాటుగా యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా ఉండనుంది. అయితే కరీనా కపూర్ రోల్ లో ఇప్పుడు ఏ స్టార్ హీరోయిన్ ఉంటుంది అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. టాక్సిక్ చిత్రం ఏప్రిల్ 10, 2025 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల విడుదల కానుంది.


bottom of page