top of page
MediaFx

ఎన్నికల పేరుతో భారీ మోసం.. కేఏ పాల్‌పై పోలీస్ కేసు నమోదు..!


ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌​పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌​లో కేసు నమోదైంది. తన పార్టీ తరపున ఎల్బీనగర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి తన వద్ద నుంచి రూ.50 లక్షలు తీసుకున్నారని రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మేరకు పోలీసులు పాల్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. టిక్కెట్టు ఇస్తానని చెప్పడంతో తాను రూ.30 లక్షలు ఆన్‌లైన్‌లో చెల్లించి మిగిలిన రూ.20 లక్షలను దఫా దఫాలుగా చెల్లించినట్లు కిరణ్‌కుమార్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ఫిర్యాదు మేరకు కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

కాగా, తన సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశాఖపట్నం దగ్గరలోని చిట్టివలసలో ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన కేఏ పాల్​.. గతంలో క్రైస్తవమత ప్రబోధకుడిగా మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా ఆయన ఏపీలోని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గానికి పోటీచేశారు. ఎన్నికల్లో తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ఆడుతూ, పాడుతూ ఎన్నికల్లో ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. గతంలో జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో కూడా కేఏ పాల్​పోటీ చేశారు. ఆయన చివరకు 805 ఓట్లు మాత్రమే సాధించారు. ఈసారి ఎన్నికల్లో కుండ గుర్తుతో ఎన్నికల్లో కేఏ పాల్​పోటీచేశారు. 

bottom of page