top of page
MediaFx

కాంతార ఎ లెజెండ్ కోసం భారీ ప్లానింగ్.!🎥


ఫిల్మ్ మేకింగ్‌ బార్‌ని రెయిజ్‌ చేసే టాపిక్‌ మీద రీసెర్చ్ చేస్తున్నట్టున్నారు రిషబ్‌ శెట్టి. కాంతార చాప్టర్‌ 1 కోసం ఆయన వేస్తున్న స్టెప్పులు చూసి ఆశ్చర్యపోతున్నారు మిగిలిన మేకర్స్.

ఇప్పటిదాకా మీరు చూసింది జస్ట్ శాంపిల్‌ మాత్రమే, సిసలైన వంటని సిద్ధం చేస్తున్నాం వెయిట్‌ చేయండి అన్నట్టుంది రిషబ్‌ యాటిట్యూడ్‌ మీరు చూస్తానంటే, నేను తీసే రేంజ్‌ ఎలా ఉంటుందో కాంతార ఎ లెజెండ్‌లో చూద్దురుగానీ అని సిగ్నల్స్ పంపిస్తున్నారు రిషబ్‌ శెట్టి.

ఈ సినిమా కోసం ఆయన హార్స్ రైడింగ్‌, కళరిపయట్టు కూడా నేర్చుకుంటున్నారు. కాంతారలో హీరోగా, డైరక్టర్‌గా మెప్పించిన రిషబ్‌.. ఇప్పుడు ఎ లెజెండ్‌లోనూ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కుందపురలో దాదాపు 200 ఇన్‌టు 200 స్క్వేర్‌ఫీట్ల స్పేస్‌లో సెట్స్ కడుతున్నారు కాంతార ఎ లెజెండ్‌ కోసం. దాదాపు 600 మంది ఈ సెట్స్ నిర్మాణంలో పాల్గొంటున్నారట.

టెక్నికల్‌గా అప్‌టు డేట్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. ఎయిర్‌ కండిషన్‌ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే డబ్బింగ్‌, ఎడిటింగ్‌ ఫెసిలిటీస్‌ ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఇండియన్‌ సినిమా స్టాండర్డ్స్ ఇలా ఉంటాయి అని ప్రపంచానికి చాటి చెప్పాలన్నదే రిషబ్‌ ఏకైక ధ్యేయం అంటోంది శాండిల్‌వుడ్‌. ఆయన ఫస్ట్ పార్టుతో ప్రూవ్‌ చేసుకోవడంతో, హోంబలే సంస్థ కూడా ఖర్చుకు వెనకాడటం లేదన్నది న్యూస్‌.

డివైన్‌ బ్లాక్‌బస్టర్‌ కి తెరకెక్కుతున్న ఈ ప్రీక్వెల్‌ మీద అంచనాలు భారీగా క్రియేట్‌ అవుతున్నాయి. ఏం ఫర్వాలేదు అంటూ, ఆ ఫీలింగ్‌ని కూడా ఎంజాయ్‌ చేస్తున్నారు రిషబ్‌.

bottom of page