top of page

🎬 మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమాలో మోహన్ లాల్! 🎬

మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న 'కన్నప్ప' సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న సినిమా 🎥 ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్న ప్రభాస్ 😎

కీలకమైన పాత్రను పోషించనున్న మోహన్ లాల్మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమా గురించి వస్తోన్న అప్డేట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. రోజురోజుకూ కన్నప్ప మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. 📰 పాన్ ఇండియా సినిమాగా కన్నప్పను మంచు విష్ణు భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, 'మహాభారత్' సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 🎬 హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో 'కన్నప్ప' సినిమా రాబోతోంది. ఈ మూవీలో ప్రభాస్ కూడా ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ ఈ సినిమాలోకి వచ్చారు. మాలీవుడ్ సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ సైతం కన్నప్ప సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నారు. ఈ మేరకు మంచు విష్ణు రీసెంట్‌గా మోహన్ లాల్‌ను కలిశారు. ఈ మేరకు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page