top of page

కన్నడ హీరో దర్శన్ అరెస్ట్.. ఎందుకంటే?

ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌ తూగుదీపను బెంగళూరు పోలీసులు మర్డర్ కేసులో అరెస్ట్ చేశారు. మంగళవారం మైసూరులో దర్శన్‌తో పాటు మరో పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం, దర్యాప్తు నిమిత్తం దర్శన్‌ను బెంగళూరుకు తరలించారు.

జూన్‌ 8న రేణుకాస్వామి అనే మహిళ హత్యకు గురైయింది. ఆ మరుసటి రోజు కామాక్షిపాళ్యం దగ్గర్లోని ఒక కాలువలో ఆమె మృతదేహం లభ్యమైంది. మృతురాలి స్వస్థలం చిత్రదుర్గ అని పోలీసులు తెలిపారు. ఈ కేసులో హీరో దర్శన్‌పై ఆరోపణలు వచ్చాయి. విచారణలో భాగంగా నిందితుల్లో ఒకరు దర్శన్‌ పేరు వెల్లడించారని పోలీసులు చెప్పారు. నిందితుడితో దర్శన్‌ నిరంతరం టచ్‌లో ఉండేవారని పోలీసులు గుర్తించారు. దీంతో దర్యాప్తు కోసం ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు.

ప్రాథమిక దర్యాప్తులో దర్శన్ భార్యకి రేణుకాస్వామి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు తెలుస్తోంది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page