top of page

🥕 రోజూ ఈ డ్రింక్‌ తాగితే.. మెటిమలు మాయం అవుతాయ్‌..!

🌞 చర్మం ఆరోగ్యంగా, అందంగా, ఎలాంటి మచ్చలు లేకుండా ఉండాలని అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా కోరుకుంటారు. దీని కోసం మీరు న్యాచురల్‌ వన్‌స్టాప్‌ సొల్యూషన్‌ కోసం చూస్తున్నారా..?

🌞 చర్మం ఆరోగ్యంగా, అందంగా, ఎలాంటి మచ్చలు లేకుండా ఉండాలని అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా కోరుకుంటారు. దీని కోసం మీరు న్యాచురల్‌ వన్‌స్టాప్‌ సొల్యూషన్‌ కోసం చూస్తున్నారా..? అయితే, ఆరోగ్యకరమైన ఇండియన్‌, సాంప్రదాయ డ్రింక్‌ గంజి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. గంజి పులియబెట్టి చేసే ఇండియన్‌ డ్రింక్‌. దీన్ని క్యారెట్‌, ఆవాలు, మసాలాలతో తయారు చేస్తారు. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. చాలామంది దీన్ని ఇండియన్‌ కొంబుచా అని పిలుస్తుంటారు. గంజిని మీ ఆహారంలో రిఫ్రెష్‌ డ్రింక్‌గా, సైడ్‌ డిష్‌గా తీసుకోవచ్చు. గంజిలో మీ చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతమైన ఛాయను ప్రోత్సహించే ప్రయోజనకరమైన పోషకాలు, సమ్మేళనాలు ఉంటాయి. మీరు హెల్తీ లైఫ్‌స్టైల్‌ ఫాలో అవుతూ.. గంజిని మీ డైట్‌లో చేర్చుకుంటే మీ చర్మాన్ని సంరక్షించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. 🌞 

గంజిలోని క్యారెట్‌లో బీటా కెరోటిన్‌, ఆవాలలో ఫినాలిక్‌ సమ్మేళనాలు వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను న్యూట్రల్‌ చేయడానికి సహాయపడతాయి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. గంజిలోని యాంటీఆక్సిడెంట్లు... వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటాయి. క్యారెట్‌లో సమృద్ధిగా ఉండే.. విటమిన్‌ సి కొల్లాజెన్‌ సంశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మం స్థితిస్థాపకత, దృఢత్వాన్ని నిర్వహించడానికి కొల్లాజెన్‌ అవసరం. ఇది ఫైన్‌ లైన్‌స్‌, ముతల రూపాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. 

🥕 మొటిమలు, మచ్చలు, పగుళ్ళను నివారిస్తుంది..🌞

గంజి డ్రింక్‌ను పులియబెట్టి తీసుకుంటారు. దీనిలో ప్రయోజనకరమైన ప్రోబయోటిక్స్‌, ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది గట్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. మొటిమలు, వాపు వంటి చర్మ సమస్యలకు కారణం అయ్యే టాక్సిన్స్‌, వ్యర్థ పదార్థాలను శరీరంలో నుంచి తొలగించడానికి తోడ్పడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి జీర్ణక్రియ అవసరం, ఇది చర్మానికి అవసరమైన పోషకాలు బాగా గ్రహించడానికి తోడ్పడుతుంది. గంజిలోని ప్రోబయోటిక్ కంటెంట్ ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది స్పష్టమైన, ఆరోగ్యకరమైన చర్మానికి దారి తీస్తుంది. 

bottom of page