top of page
MediaFx

కని కుస్రుతి కష్టాల నుంచి కేన్స్ వరకూ 🌟


నటి కని కుస్రుతి.. గత మూడు వారం రోజులుగా సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్న పేరు. ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ సినిమాతో ఈ భామ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. డైరెక్టర్ పాయల్ కపాడియా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో మలయాళీ నటి కని కుస్రుతి కీలకపాత్ర పోషించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ సినిమాకు గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న కని కుస్రుతి..ఆ వేడుకలలో పుచ్చకాయను పోలి ఉన్న హ్యాండ్ బ్యాగ్ తో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కని కుస్రుతి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను బయటపెట్టింది. "ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను. జీవనోపాధి కోసమే సినిమాల్లో నటించాల్సి వచ్చింది. 2020లో నేను నటించిన మలయాళీ సినిమా బిరియానికి కేరల స్టేట్ ఫిల్మ్ అవార్డ్, మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డ్ వచ్చాయి. కానీ అంతకుముందు నా జీవితం మొత్తం కన్నీళ్లతోనే పోరాటమే చేశాను," అని తెలిపింది కని.

కని చెప్పినట్లుగా, సజిన్ బాబు ఆమెను ఒక స్క్రిప్ట్ కోసం సంప్రదించాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా, ఆ పాత్రను తిరస్కరించింది. మూడు నెలల తర్వాత, నిర్మాత మళ్లీ సంప్రదించి ₹70,000 ఆఫర్ చేశాడు. అప్పుడు ఆమె అకౌంట్లో కేవలం ₹3,000 మాత్రమే ఉన్నాయి.

"నేను థియేటర్ కే పరిమితమై ఉంటే బాగా సంపాదించగలిగితే సినిమాల్లోకి రాకపోవచ్చని అనిపిస్తుంది. భవిష్యత్తులో జీవనోపాధి పొందే పరిస్థితులు లేకపోతే మళ్లీ తనకు ఇష్టంలేని పనులు చేయ్యొచ్చు," అని చెప్పింది కని.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చరిత్ర సృష్టించిన "ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్" సినిమా ముంబైలో నివసిస్తున్న ఇద్దరు మలయాళీ నర్సుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఇందులో దివ్యప్రభ, ఛాయా కదమ్, హృదు హరూన్, అజీస్ నెడుమంగడ్, టింటుమోల్ జోసెఫ్ కీలకపాత్రలు పోషించారు.

bottom of page