top of page
MediaFx

పాక్ లో గాజుల కొరత కూడా ఉందని మాకు తెలీదు.. కంగనా రనౌత్..


ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కంగాన రనౌత్ కులు ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కంగానా పాకిస్తాన్ పై, ఇండియా కూటమిపై మండిపడ్డారు. ఇటీవల నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. పాకీస్థాన్ గాజులు వేసుకుని కూర్చోలేదని,తమ జోలికివస్తే అణుబాంబులతో సమాధానమిస్తామని వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యార్ కూడా.. పాక్ వద్ద అణుబాంబులున్నాయని ఆచీతూచీ నిర్ణయాలు తీసుకొవాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. హిమచల్ ప్రదేశ్ లోని మండి నుంచి ఎన్నికల బరిలో ఉన్న కంగానా రనౌత్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. పాక్ లో ఇప్పటి వరకు, నిత్యావసరాలు, గోధుమలు, డీజీల్, ఆహార పదార్థాల కోరత ఉందని మాత్రమే అనుకుంటున్నామని, కానీ ఇటీవల పాక్ లో గాజుల కొరత కూడా ఉందని సెటైర్ లు వేశారు. అంతే కాకుండా కాంగ్రెస్ నేతలు.. పాక్ దగ్గర అణుబాంబులున్నాయని, భయపడుతున్నారని, ఇలాంటి వారు దేశానికి ఎలాంటి మంచిచేస్తారంటూ ఎద్దేవా చేశారు.

తొందరలోనే పాక్ కు గాజులు వేసుకునేలా చేస్తామని ఫైర్ అయ్యారు. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ కూడా ఇటీవల పాక్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక పాక్ ఫరూక్ అబ్దుల్లా చేసిన కామెంట్లపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా సెటైర్ లు వేశారు. పాక్.. అణుబాంబులు వేస్తామని భయపెడుతుంది... తమ వద్ద ఉన్న అణు బాంబులు ఫ్రిడ్జీలో పెట్టుకొవడానికి అనుకుంటున్నారా..?.. అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఎన్నికలలో ఓటు వేస్తే, అది పాక్ కు పోతుందని ఇటీవల, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ వ్యాఖ్యలు చేశారు.

bottom of page