top of page
MediaFx

కంగనారనౌత్‌ ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం..?


ఎమర్జెన్సీ సినిమా రిలీజ్‌పై ప్రభుత్వం న్యాయపరమైన సంప్రదింపులు జరుపుతూ.. నిషేధం అంశాన్ని పరీలిస్తుందని ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ తెలిపారు. మాజీ ఐపీఎస్‌ అధికారి తేజ్‌ దీప్‌ కౌర్ మీనన్‌ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధుల బృందం షబ్బీర్‌ను కలిసి ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం విధించాలని కోరింది. సిక్కు సొసైటీ ప్రతినిధులు సినిమాలో సిక్కు సమాజాన్ని చూపించిన తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. రాష్ట్రంలో సినిమాను నిషేధించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్‌ రెడ్డిని షబ్బీర్ కోరినట్టు సమాచారం.

ఎమర్జెన్సీ సమయంలో పౌరహక్కుల సస్పెన్షన్‌, ఇందిరా గాంధీ వ్యతిరేకుల అరెస్టుతోపాటు పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని తెలిసిందే. ఎమ‌ర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నిలబ‌డ్డ ప్రముఖ రాజ‌కీయ వేత్త జ‌య‌ప్రకాశ్‌ నారాయ‌ణ్ (జేపీ) పాత్రలో పాపులర్‌ బాలీవుడ్‌ ద‌ర్శకనిర్మాత అనుప‌మ్ ఖేర్ న‌టిస్తుండగా.. శ్రేయాస్ తల్పడే, భూమికా చావ్లా ఇత‌ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఎమర్జెన్సీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన వివిధ పాత్రలకు సంబంధించిన పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని కంగనా హోం బ్యాన‌ర్ మ‌ణి క‌ర్ణిక ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై రేణు పిట్టి, కంగ‌నార‌నౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు.


bottom of page