top of page
MediaFx

కంగనా సినిమాకు కొత్త కష్టం.. ఎమర్జెన్సీ‌కి షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు


మొదట్లో సినిమా చూసిన తర్వాత సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చేందుకు అంగీకరించింది. కానీ, ఇప్పుడు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. వాళ్ల పై ఎవరో ఒత్తిడి చేస్తున్నారు. కావాలనే నా సినిమాను అడ్డుకుంటున్నారు.  సినిమా విడుదల కోసం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని కంగనారనౌత్ తెలిపారు. ఈ సినిమాపై నిషేధం విధించేందుకు కొన్ని రాష్ట్రాలు ముందుకొచ్చాయి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆలోచన చేసిందని టాక్ వినిపిస్తుంది. సినిమాలో సిక్కు కమ్యూనిటీని చెడుగా చిత్రీకరించారని ఆరోపణలు వచ్చాయి. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే సినిమా విడుదల అవ్వదు. దాంతో ఇప్పుడు కంగనాకు కొత్త కష్టం వచ్చి పడింది.  ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 6న సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ వస్తుందా లేదా అనే ప్రశ్న తలెత్తింది. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాపై నిషేధం విధించినా, దాన్ని తొలగించాలని కోర్టు ఆదేశించవచ్చు. గతంలో ‘ది కేరళ స్టోరీ’ సినిమా పై పశ్చిమ బెంగాల్ నిషేధం విధించింది. కోర్టు ఆదేశాల తర్వాత నిషేధాన్ని ఎత్తివేశారు. ఇప్పుడు కంగనా సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

bottom of page