top of page
MediaFx

2 గంటల్లో పాట రాసిచ్చిన కమల్..🎵✨


కమల్ హాసన్ ఎంత గొప్ప నటుడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే యాక్టింగ్‌తో పాటు కమల్‌కి మొత్తం 24 క్రాఫ్ట్స్‌పై అద్భుతమైన పట్టు ఉంది. ఎందుకంటే నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్‌గా, డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా ఇలా ఎన్నో రంగాల్లో కమల్ హాసన్ సత్తా చాటారు. ఇక 35 ఏళ్ల తర్వాత దర్శకుడు మణిరత్నంతో మళ్లీ కమల్ కలిసి పని చేయడంతో 'థగ్ లైఫ్' సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజా గా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే? కమల్ హాసన్ ఈ చిత్రంలోని ఓ పాటకు లిరిక్స్ రాశారు. అంతేకాకుండా ఈ పాటను రాయడానికి, కంపోజ్ చేసి రికార్డ్ చేయడానికి కేవలం రెండు గంటలే పట్టడం మరో విశేషం. ఇక తమిళంలో ఇప్పటికే కమల్ కొన్ని పాటలు స్వయంగా రాసి పాడిన సంగతి తెలిసిందే.రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్.మహేంద్రన్, శివ అనంతి థగ్ లైఫ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష, శింబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.


bottom of page