top of page
MediaFx

నాతో మూడేళ్లు మూవీ తీసి.. 50 సెకన్ల టీజర్ వేస్తావా?


ఇప్పటివరకూ తెలుగు సినిమా చరిత్రలో జరిగిన సినిమా ఫంక్షన్లు అన్నీ ఓ లెక్క అయితే.. బుధవారం నాడు ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా ఈవెంట్ మరోలెక్క అనేట్టుగా సాగింది ఈ భారీ ఈవెంట్. కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఈవెంట్‌ను నిర్విహించారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్‌ని ఏర్పాటు చేశారు. అత్యధిక సంఖ్యలో ప్రభాస్ అభిమానులు హాజరుకాగా.. కల్కి సినిమాలో ‘బుజ్జి’ (కారు)ని పరిచయం చేశాడు బుజ్జిగాడు ప్రభాస్.మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మించారు. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది కల్కి (Kalki 2898 AD). ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. ‘కల్కి’ చిత్రంలో కీలకంగా ఉన్న బుజ్జి టీజర్‌‌ను లాంఛ్ చేశారు. 50 సెకన్ల నిడివితో ఉన్న బుజ్జి టీజర్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. ‘‘మా బక్క డైరెక్టర్.. ఈ బుజ్జితో నన్ను టార్చర్ పెట్టాడు. నాతో మూడేళ్లు సినిమా తీసి.. 50 సెకన్ల టీజర్ చూపిస్తారా? ఏంటి సార్ ఇదీ.. మిమ్మల్ని (నాగ్ అశ్విన్‌ని) కొట్టాలి.. ఇటు రండి (నవ్వుతూ). నేనేదో నా డార్లింగ్స్‌కి హాయ్ చెప్పి.. వెళ్లిపోదాం అంటే.. ఈ కార్లు, ఫీట్లుతో ఏదేదో చేయిస్తున్నాడు. నేను కూడా ఈ సినిమా కోసం మీలాగే ఎదురుచూస్తున్నాను. నా లైఫ్‌లో ఎవరో ఇంపార్టెంట్ వ్యక్తి వస్తున్నారని ట్వీట్ చేశాను.. అదంతా మా డైరెక్టర్ ఐడియాలే. ప్రస్తుతానికి ఈ బుజ్జిని మూడేళ్లు పాటు తగిలించాడు. బుజ్జి బ్రెయిన్ కంటే బాడీనే బెటర్. అది నా బుర్రమొత్తం తినేసింది.అంటూ ఫ్యాన్స్‌ని తన స్పీచ్‌తో ఉత్సాహపరిచారు ప్రభాస్.

bottom of page