top of page
Suresh D

కల్కి 2898 ఏడీపై నాగ్ అశ్విన్ చెప్పిన విషయాలు వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. మహాభారతంతో లింక్ ✨🎞️

ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. ఈ మూవీకి మహాభారతంతో ఉన్న లింకేంటో అతడు వివరించాడు.

కల్కి 2898 ఏడీ మూవీ గురించి ఆ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ మధ్య వెల్లడించిన విషయాలు వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అసలు ఈ సినిమాకు, మహాభారతానికి ఉన్న లింకు.. మూవీ కోసం క్రియేట్ చేసిన సెట్స్, వెహికిల్స్ గురించి అతడు చెప్పాడు. గుర్గావ్ లో జరిగిన సినాప్సె 2024 ఈవెంట్ లో అతడు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటితో కలిసి హాజరయ్యాడు. 

కల్కి 2898 ఏడీ మూవీ మే 9న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మళ్లీ వాయిదా పడనుందన్న వార్తల నేపథ్యంలో మే 9నే అంటూ మరోసారి నాగ్ అశ్విన్ ఈ ఈవెంట్లో కన్ఫమ్ చేశాడు. ప్రభాస్, దీపికా, అమితాబ్, కమల్ హాసన్ లాంటి వాళ్లు నటిస్తున్న ఈ సినిమా గురించి అతడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు.ఈ కల్కి 2898 ఏడీ మూవీ 6 వేల సంవత్సరాల టైమ్ లైన్ తో ఉండబోతోందని అతడు చెప్పడం విశేషం. "సినిమా మహాభారతంతో మొదలై 2898 ఏడీ సంవత్సరంలో ముగుస్తుంది. అంటే 6000 సంవత్సరాల కాలం సాగనుంది. ఆ ప్రపంచాలు ఎలా ఉంటాయన్నది చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా పూర్తి భారతీయతతో ఉండేలా జాగ్రత్త పడుతున్నాం" అని నాగ్ అశ్విన్ అన్నాడు.కృష్ణ భగవానుడు క్రీస్తు పూర్వం 3102లో నిర్యాణం చెందాడని చెబుతారు. దీంతో అప్పటి నుంచి 2898 ఏడీ వరకూ తీసుకుంటే ఆరు వేల ఏళ్లు పూర్తవుతుంది. ఆ రెండు కాలాల మధ్య ఉన్న సమయాన్ని ఈ కల్కి 2898 ఏడీ మూవీలో నాగ్ అశ్విన్ చూపించే ప్రయత్నం చేయనున్నారు. ఈ సినిమా కోసం తాము ఎంతలా శ్రమించింది కూడా వెల్లడించాడు.✨🎞️

Comments


bottom of page