top of page
MediaFx

“థీమ్ ఆఫ్ కల్కి” సాంగ్ ను రిలీజ్ చేసిన మేకర్స్!

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏ.డి (Kalki 2898AD). దీపికా పదుకునే, దిశా పటానిలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలు సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇప్పటికే అన్ని చోట్ల భారీ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రం నుండి థీమ్ ఆఫ్ కల్కి సాంగ్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేయడం జరిగింది. ఈ సాంగ్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.


bottom of page