top of page

'కల్కి 2898 AD' హిందీ థియేట్రికల్ రైట్స్‌పై ఆసక్తికరమైన బజ్🎥✨

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. త్వరలో ఈ సినిమా టీజర్ విడుదల కానుండడంతో అభిమానుల్లో, సాధారణ ప్రేక్షకుల్లో సందడి నెలకొంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ పంపిణీ సంస్థ 110 కోట్లకి సొంతం చేసుకున్నట్లు సమాచారం. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్-ఇండియా బిగ్గీ ప్రపంచవ్యాప్తంగా మే 9, 2024న విడుదల కానుంది.ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్,మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.🎥✨

bottom of page