top of page
MediaFx

“కల్కి 2898 ఎడి” కి పెద్ద రన్ టైం లాక్!?

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ ఇంకా అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలతో చేసిన మాసివ్ ఫీస్ట్ చిత్రం “కల్కి 2898 ఎడి”. ఈ చిత్రానికి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోషన్స్ జరుగుతున్నాయి.ఇటీవల, ఈ సినిమా సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకి వచ్చాయి. ఈ చిత్రం 3 గంటల రన్ టైం తో రాబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ తరహా సినిమాలు అన్నీ దాదాపు 3 గంటలు లేదా 3 గంటలు దాటే రన్ టైం తో వస్తున్నాయి. ఇప్పుడు ఇదే కోవలో కల్కి కూడా 3 గంటల రన్ టైం తో రాబోతుందట. దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.ఇంకా ఈ భారీ సినిమాలో దీపికా పదుకోణ్, దిశా పటాని తదితరులు నటిస్తుండగా, బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది. ఈ అవైటెడ్ చిత్రం ఈ జూన్ 27న గ్రాండ్ రిలీజ్ కి రాబోతుంది.

bottom of page