top of page
MediaFx

కలియుగ కర్ణుడు సోనూ సూద్ ఆస్తి ఎంతో తెలిస్తే అవాక్ అవుతారు..


1999లో సోనూసూద్ ‘కల్లగర్’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. 2009లో విడుదలైన ‘అరుంధతి’ సినిమా ఆయన క్రేజ్ ను పెంచేసింది. ఈ సినిమాలో పశుపతి అనే విలన్‌ పాత్రలో నటించి మెప్పించాడు. తెలుగులో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించాడు సోనూ సూద్ .  ఆ తర్వాత హిందీలో ‘దబాంగ్‌’, ‘జోధా అక్బర్‌’తో పాటు పలు సినిమాలు చేశాడు. అలాగే కన్నడ ఇండస్ట్రీలోనూ కొన్ని సినిమాలు చేశారు. ఇక కోవిడ్ సమయంలో చాలా మందికి సహాయం చేశాడు. సోనూ సూద్ తన ఛారిటీ ద్వారా చాలా మందికి సహాయం అందించాడు. ఇప్పటికీ ఆయన సాయం చేస్తూ ప్రజలను ఆడుకుంటున్నాడు. సోనూ సూద్ మొత్తం ఆస్తులు 140 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. సోనూ సూద్‌కు సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్లు అలాగే అతను నడుపుతున్న హోటళ్ల నుంచి భారీగా సంపాదిస్తున్నారు. వచ్చే ఆదాయంలో కొంత మంచి పనులకు వినియోగిస్తున్నాడు. సోనూసూద్‌కి కార్లపై పెద్దగా వ్యామోహం లేదు. ఆయన దగ్గర పోర్షా పనామెరా, బెంజ్ ఎంఎల్ క్లాస్ కార్లు ఉన్నాయి. మిగిలినవి చిన్న కార్లు. అలాగే సోనూసూద్‌కు సొంత నిర్మాణ సంస్థ ఉంది. వీటితోపాటు సోనూసూద్‌కి ముంబైలో పెద్ద ఇల్లు ఉంది. అలాగే సొంత రెస్టారెంట్ కూడా ఉంది.అలాగే ముంబైలో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉంది.. సోనూసూద్ ఒక్కో సినిమాకు 2-5 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటారు. ఈ మధ్యకాలంలో విలన్‌ పాత్రను అంగీకరించడం లేదు. దాంతో ఆయనకు పెద్దగా సినిమా ఆఫర్లు రావడం లేదని తెలుస్తోంది.



bottom of page