top of page
MediaFx

కాజల్ అగర్వాల్ ఐశ్వర్య రాయ్ చెల్లిగా ఓ సినిమా చేసింది తెలుసా?🌟


కాజల్ అగర్వాల్ లక్ష్మి కళ్యాణం సినిమాతో సినీ పరిశ్రమలోకి వచ్చి ఎన్నో సినిమాలతో మెప్పించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు 17 ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తుంది. కరోనా సమయంలో సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసుకొని, బాబుని కని ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది. ఇప్పుడు మళ్ళీ ‘సత్యభామ’(Satyabhama) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాజల్ మొదటిసారి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాతో వస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సత్యభామ(Satyabhama) సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికర విషయాలు తెలుపుతుంది. అయితే ఈ క్రమంలో తను సినీ పరిశ్రమలోకి అధికారికంగా ఎంట్రీ ఇవ్వకముందు ఓ సినిమా చేసినట్లు తెలిపింది.

కాజల్ అగర్వాల్ లక్ష్మి కళ్యాణం సినిమాతో 2007లో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అంతకు ముందే 2004 లో ‘క్యూన్ హో గయా నా’ అనే హిందీ సినిమాలో చిన్న పాత్ర చేసింది. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, వివేక్ ఒబెరాయ్, సునీల్ శెట్టి.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ చెల్లెలి పాత్రలో కాజల్ కనిపించింది. అయితే ఆ పాత్ర కొద్దిసేపు మాత్రమే తెరపై కనిపిస్తుంది.దీని గురించి కాజల్ మాట్లాడుతూ.. ముంబైలో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది ఆ పాత్ర. అప్పటికి నాకు సినిమాల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన కూడా రాలేదు. వచ్చింది అని చేసేసాను. దానికి నాకు ఏం రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. సరదాగా వెళ్లి సరదాగా చేసేసాను అని తెలిపింది.

Related Posts

See All

నైజాం మార్కెట్ లో ఇక నుంచి ఈ విధంగా డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ షేర్లు🎥

అయితే ఇది మరీ ముఖ్యంగా నైజాం ప్రాంతంలో కనిపించింది. దీనితో తాజాగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

గ్రాండ్ గా “కల్కి” ఈవెంట్ ను ప్లాన్ చేసిన టీమ్..!🌟

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏ.డ

bottom of page