top of page
Shiva YT

నా గురించి ఇష్టానుసారంగా మాట్లాడారు వాళ్ళకి అప్పుడే సమాధానం చెప్తా..

యంగ్ హీరోలతో మొదలు పెట్టి స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది కాజల్. ఇక ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళ్ లోనూ సత్తా చాటింది. అలాగే హిందీలోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది.

టాలీవుడ్ అందాల చందమామ ఎవడు అంటే టక్కున చేప్పే పేరు కాజల్. చూడచక్కని రూపం.. చందమామలాంటి మోము ఉన్న ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే స్టార్ హీరోయిన్ గా రాణించింది కాజల్. యంగ్ హీరోలతో మొదలు పెట్టి స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది కాజల్. ఇక ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళ్ లోనూ సత్తా చాటింది. అలాగే హిందీలోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది. గౌతమ్ కిచ్లును వివాహమాడిన తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది ఈ భామ. ఇటీవలే పండండి బిడ్డకు కూడా జన్మనించింది. అయితే ప్రగ్నెన్సీ సమయంలో కాజల్ శరీరంలో చాలా మార్పులు వచ్చాయి.ఆసమయంలో ఆమె పై పలు ట్రోల్స్ కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అయితే బిడ్డ పుట్టిన తర్వాత ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది కాజల్. కమల్ హాసన్ నటిస్తోన్న భారతీయుడు 2 సినిమాలో నటిస్తోంది కాజల్. అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో కూడా నటిస్తోంది ఏ చిన్నది.తాజాగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రగ్నెన్సీ సమయంలో తన పై వచ్చిన ట్రోల్స్ గురించి స్పందించింది. ప్రగ్నెన్సీ టైం లో చాలా మంది నా శరీరాకృతి పై కామెంట్స్ చేశారు. బిడ్డ పుట్టిన కొద్ది రోజులకే సినిమాల్లో నటించడం పై చాలా మంది ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది కాజల్. నా కొడుకును ఉన్నతంగా తీర్చిదిద్ది నా పై కామెంట్స్ చేసిన వారికి సరైన సమాధానం చెప్తా అని తెలిపింది కాజల్ అగర్వాల్.



bottom of page