top of page

🚧 టెన్షన్ పెడుతున్న కడెం ప్రాజెక్టు.. 🏞️

🏞️ నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మరోసారి కంగారు పెడుతోంది. భారీ వర్షాలతో ప్రాజెక్టు నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. 💧🌊 కడెం ప్రాజెక్టు క్యాచ్ మెంట్ ఏరియాలో కుండపోత వర్షాలతో ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో ఎక్కువైంది. ☔

🏞️ దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు శుక్రవారం కసరత్తు ప్రారంభించారు. 🚧👷‍♂️ అయితే అక్కడ ఎక్కువగా ఉన్న తేనెటీగలు విధులకు ఆటంకం కలిగిస్తున్నాయి. 😱🐝 మొత్తం 18 గేట్లలో 12 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 🛠️🚜 అయితే 4 గేట్లు మెరాయించడంతో టెన్షన్ మొదలయింది. 😬

6,8,12,16 నెంబర్ల గేట్లు ఎత్తేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నాయి. 🔧👨‍🔧 చాలా కాలంగా గేట్లు తెరకపోవడంతో మొరాయిస్తున్నాయి. 2,3,12 నంబర్ల గేట్లు తెరుచుకోవని సిబ్బంది స్పష్టం చేశారు. 🧐🔧 మిగతా గేట్లను ఎత్తేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 🔧👷‍♂️ యంత్రాలతో గేట్లు లేవకపోవడంతో.. మనుషులతో గేట్లను ఎత్తేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 👨‍🌾👷‍♂️ గేట్లు సకాలంలో తెరుచుకోకపోతే ప్రాజెక్టు సమీపంలోని లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 💦💨 గేట్లకు మరమ్మత్తులు చేయించడంలో ప్రభుత్వం, అధికారుల అలసత్వం కారణమన్న విమర్శలు విన్పిస్తున్నాయి. 🤔💭

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page