top of page

తెలుగమ్మాయిని తొక్కేయాలని చూశారు! కానీ తెలివిగా వ్యవహరించింది..!

చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో తెలుగమ్మాయి మరియు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అయిన జ్యోతి యర్రాజీ 100మీటర్ల హర్డిల్స్ లో రజత పతకం సాధించింది. అయితే దానికన్నా ముందు అక్కడ చోటు చేసుకున్న డ్రామా అంతా ఇంతా కాదు. ఏకంగా జ్యోతిని డిస్ క్వాలిఫై చేసేశారు. ఇది చైనా అఫీషియల్స్ వివక్షేనంటూ సోషల్ మీడియాలో భారత ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో వివరంగా చెప్పుకుందాం.

మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రేస్ స్టార్ట్ అవబోతోంది. పతక ఫేవరెట్లలో మన జ్యోతి కూడా ఒకరు. అయితే గన్ పేలకముందే చైనాకు చెందిన యన్నీ వూ అనే అథ్లెట్ పరిగెత్తడం మొదలుపెట్టింది. దీన్నే ఫాల్స్ స్టార్ట్ అంటారు. ఆమెను చూసి జ్యోతితో పాటు మిగతా అథ్లెట్లు కూడా పరుగు మొదలుపెట్టారు. ఫాల్స్ స్టార్ట్ చేసినందుకు ఆ చైనా అథ్లెట్ తో పాటు మన జ్యోతికి కూడా రెడ్ కార్డ్ చూపించారు. అంటే రేస్ లో పాల్గొనడానికి వీల్లేకుండా.

అఫీషియల్స్ నిర్ణయంపై జ్యోతి రూల్స్ ప్రకారమే ప్రొటెస్ట్ చేసింది.అభ్యంతరం తెలిపింది. చైనా అథ్లెట్ ఫాల్స్ స్టార్ట్ చేస్తే తానెందుకు శిక్ష ఎదుర్కోవాలని ప్రశ్నించింది. రూల్స్ ప్రకారం ఎవరైతే ముందు ఫాల్స్ స్టార్ట్ చేస్తారో వారొక్కరే డిస్ క్వాలిఫై అవుతారు. ఎందుకంటే మిగతా అథ్లెట్లు కూడా ఆ ఒక్కర్నే చూసి ఫాలో అయిపోతారు కాబట్టి. జ్యోతి అభ్యంతరం తెలిపిన తర్వాత అనేకసార్లు రిప్లేలు చూసిన అఫీషియల్స్, జ్యోతితో పాటు చైనా అథ్లెట్ కు కూడా రేసులో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. కానీ రేస్ తర్వాత వారి డిస్ క్వాలిఫికేషన్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పారు. రేస్ పూర్తయింది. ఆ చైనా అథ్లెంట్ రెండో స్థానంలో, మన జ్యోతి మూడో స్థానంలో నిలిచారు. కానీ మరోసారి రీప్లేలు చూసిన అఫీషియల్స్ చైనా అథ్లెట్ యన్నీ వూను డిస్ క్వాలిఫై చేశారు. అప్పుడు ఆటోమేటిక్ గా మూడో స్థానంలో ఉన్న జ్యోతి, రెండో స్థానానికి చేరి రజత పతకం పట్టేసింది.

రేస్ ప్రారంభానికి ముందు ఈ ఇన్సిడెంట్ వల్ల జ్యోతి డిస్టర్బ్ అయిందని, లేకపోతే ఇంకా బాగా పరిగెత్తేదని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అంజు బాబీ జార్జ్ అన్నారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page