top of page

మళ్లీ ఇంతకాలానికి విజయ్ మూవీలో జ్యోతిక!🎥🎞️

సూర్యతో వివాహమైన తరువాత జ్యోతిక సినిమాలను పక్కన పెట్టేసింది. ఈ మధ్యనే రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, తనకి నచ్చిన పాత్రలను చేస్తూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ సినిమాలో ఆమె ఒక ముఖ్యమైన పాత్రను చేయనున్నట్టుగా తెలుస్తోంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించే సినిమా ఇది.గతంలో విజయ్ జోడీగా జ్యోతిక 'ఖుషి' సినిమా చేసింది. ఆ తరువాత ఆయన సరసన 'తిరుమలై' చేసింది. ఈ రెండూ కూడా సూపర్ హిట్ సినిమాలే. మళ్లీ ఇంతకాలానికి ఆమె విజయ్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం విజయ్ చేస్తున్న 'లియో' పూర్తికాగానే, ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page