top of page

నా వల్లే చిరంజీవి మెగా స్టార్ అయ్యాడు - నారాయణ రావు

తాజా ఇంటర్వ్యూలో జీవీ నారాయణ రావు చాలా విషయాలని పంచుకున్నారు. అసలు అన్నపూర్ణ స్టూడియోని ఎలా నిర్మించారు, చిరంజీవికి ఇచ్చిన సలహాల గురించి ఆయన గుర్తుచేసుకున్నారు.చిరంజీవి ఇప్పుడు మెగాస్టార్ అయ్యారంటే అప్పుడు ఆయన ఇచ్చిన సలహాలే ఉపయోపడ్డాయని గుర్తుచేసుకున్నారు. జీవీ నారాయణ రావు కే.బాలచందర్ గారి ‘అంతులేని కథ’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.అప్పట్లో హీరోగా కొన్ని సినిమాల్లో నటించిన ఆయన కొన్ని హిట్ సినిమాలని కూడా నిర్మించారు. అయన నిర్మించిన హిట్ చిత్రాల్లో యముడికి మొగుడు, చట్టానికి కళ్ళు లేవు ఉన్నాయి.

అప్పట్లో హీరోగా కొన్ని సినిమాల్లో నటించిన ఆయన కొన్ని హిట్ సినిమాలని కూడా నిర్మించారు. అయన నిర్మించిన హిట్ చిత్రాల్లో యముడికి మొగుడు, చట్టానికి కళ్ళు లేవు ఉన్నాయి. ఆ తరువాత ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకు నాగేశ్వరావు గారంటే పుట్టినప్పటి నుండి అభిమానిన్నారు. అయితే నాగేశ్వరావు గారి చాలా సినిమాలు సారథి స్టూడియోలోనే షూటింగ్ జరిగేవి. ఈ స్టూడియో జీవీ నారాయణ తండ్రిది కావడంతో ఈ స్టూడియోకి నాగేశ్వరావుకి మంచి అనుబంధం ఉండేదని గుర్తుచేశారు. అయితే అప్పుడు నాగేశ్వరావు గుండె ఆపరేషన్ కోసం వెళ్లారు. అప్పుడే సూపర్ స్టార్ కృష్ణ దేవదాస్ సినిమాని రీమేక్ చేయాలని అనుకున్నారట. అయితే నాగేశ్వరావు రియాక్ట్ అవుతూ ఒక క్లాసిక్ సినిమాని రీమేక్ చేయడం ఏంటని సీరియస్ అయ్యారు. అక్కడితో ఆగకుండా నవయుగ ప్రసాద్ తో గొడవ కూడా పడ్డారు. అప్పుడే నాగేశ్వరావుకి స్టూడియో పెట్టాలనే ఆలోచన వచ్చింది. వెంటనే నాగేశ్వరావు అన్నపూర్ణ స్టూడియోస్ ని నిర్మించారని జీవీ నారాయణ రావు గుర్తుచేశారు. ఇక ఇదే విషయాన్ని అక్కినేని నాగేశ్వరావు చాలాసార్లు నారాయణతో ప్రస్తావిస్తూ. మీ నాన్న వల్లే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించానని, నా పిల్లలకు మంచి ఆస్తి చేయగలిగానని చెప్పారట. ఈ విషయాలని ఇప్పటికి గుర్తుచేసుకున్నారు. అప్పట్లో జీవి నారాయణరావు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ తరుపున డైరెక్టర్స్ పెట్టిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకున్న తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారంట. ఈ ఇన్స్టిట్యూట్ లోనే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ లు కూడా ట్రైనింగ్ తీసుకున్నారంట. అయితే చిరంజీవిని ఈ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వమని సలహా ఇచ్చింది నేనే అని, ఆ మాటలని విన్న చిరంజీవి ఇన్స్టిట్యూట్ లో చేరి చిరంజీవి మెగాస్టార్ అయ్యారంటూ అంటూ నారాయణరావు గుర్తుచేశారు. ఇప్పుడు మెగాస్టార్ ని ఇలా చూడడం సంతోషంగా ఉందని అన్నారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page