top of page
Suresh D

‘వార్ – 2’ ఎన్టీఆర్, హృతిక్ పిక్స్ లీక్🎥✨


దేవర సినిమా షూటింగ్‏కు ఎన్టీఆర్ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వార్ 2 మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు తారక్. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాగా.. కొన్ని రోజుల క్రితం ముంబై వెళ్లారు గ్లోబల్ స్టార్. మొదటిసారి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం పది రోజుల షూటింగ్ లో మాత్రమే తారక్ కనిపించనున్నారు. తారక్, హృతిక్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నట్లు మసమాచారం. ఇందులో తారక్ రా ఏజెంట్ గా కనిపించనున్నారని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ఇద్దరూ స్టార్స్ పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ సెట్స్ నుంచి తారక్, హృతిక్ ఫోటోస్  లీక్ అయి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి..

ఇద్దరూ కూడా లేటేస్ట్ స్టైలీష్ లుక్స్‏లో కనిపిస్తున్నారు. అందులో తారక్ బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫుట్ లో ఉండగా.. హృతిక్ స్కై బ్లూ షర్ట్, బ్లాక్ కోట్ తో కనిపిస్తున్నారు. ఇద్దరూ స్టైలీష్ రా ఏజెంట్స్ లుక్స్ లో కనిపిస్తుండడంతో వీరి మధ్య యాక్షన్ సీక్వెన్స్ భారీగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. అలాగే ఇందులో యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి నటిస్తుందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.  ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 15న రిలీజ్ చేయనున్నారు.🎥✨



bottom of page