top of page
Suresh D

ఎన్టీఆర్ ‘దేవర’కు బ్రేక్.. 🎥✨

ఇప్పటికే రిలీజ్ అయిన ఫోటోస్, గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ ఏడాదిలోనే దేవర చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు మేకర్స్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలపై ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. ట్రిపుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్‏గా మారిన తారక్.. ఇప్పుడు మాస్ యాక్షన్ డ్రామాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర సినిమాపై మరింత హైప్ నెలకొంది. చాలా కాలం తర్వాత పూర్తిగా రగ్గడ్ మాస్ లుక్‍లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫోటోస్, గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ ఏడాదిలోనే దేవర చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు దేవర చిత్రీకరణకు బ్రేక్ ఇవ్వనున్నాడు తారక్. త్వరలోనే ఆయన ముంబై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దాదాపు నెల రోజులు అక్కడే ఉండనున్నారనే వార్తలు ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి.వార్ 2 కోసం తారక్ 60 రోజులు డేట్స్ ఇచ్చారట.  దీనికోసమే ముంబై వెళుతున్నట్లు తెలుస్తోంది. 🎥✨

bottom of page