top of page

జియో, ఎయిర్‌టెల్ లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్‌తో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ చూసెయ్యండి..📱💸

ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో OTTకి ఎంతో డిమాండ్ ఉంది. అందులో నెట్‌ఫ్లిక్స్‌కి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ యాప్‌లోని సీరిస్‌లు, సినిమాలను ఉచితంగా చూసేయొచ్చు. అందుకోసం ఏమి చేయాలి.. ఎంత రీఛార్జ్ చేయాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రముఖ టెలికాం దిగ్గజాలైన ఎయిర్‌టెల్, జియో కంపెనీలు తమ యూజర్ల కోసం ప్రత్యేకమైన ఆఫర్లను తీసుకొచ్చాయి. ఇందులో 5G అన్‌లిమిటెడ్ ఆఫర్లు, ఉచిత నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఇంకా అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయి. జియో, ఎయిర్‌టెల్ రెండూ కంపెనీలు ఒకదానికొకటి పోటీ పడి మరీ కాంబో ప్యాక్ ఆఫర్లను ప్రకటించాయి. సాధారణంగా నెట్‌ఫ్లిక్స్‌లో ఏవైనా టీవీ షోలు చూడాలన్నా.. వెబ్ సీరిస్‌లను చూడాలన్నా Netflix సభ్యత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎయిర్‌టెల్, జియో రీచార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్లలో వీటి గురించి తెలుసుకుంటే మీరు ఎంతవరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు.. ఎందులో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయనే వివరాలను తెలుసుకోవచ్చు. ఈ రెండింటినీ కంపేర్ చేసి ఏది చౌకగా ఉంటే.. దాన్ని కంటిన్యూ చేయండి.

ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్..

ముందుగా భారతీ ఎయిర్‌టెల్ ఇటీవలే కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. రూ.1,499 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న వారికి ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ లభించనుంది. అంతేకాదు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, అన్‌లిమిటెడ్ 5G డేటా, ఉచితంగా Hellotune, Wynk Music, 3 months Apollo 24/7, రోజుకు వంద ఉచిత SMS వంటి ఆఫర్లు లభించనున్నాయి. ఈ ప్లాన్ కాల పరిమితి 84 రోజుల పాటు ఉంటుంది.  

జియో రీఛార్జ్ ప్లాన్..

రిలయన్స్ జియో విషయానికొస్తే.. రూ.1,099తో రీఛార్జ్ చేసుకున్న వారికి ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, 2GB రోజువారీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఫ్రీ SMS, అపరిమితంగా 5G డేటాను పొందొచ్చు. అదే 1,499తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 3GB డేటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ అన్ని డివైజ్‌లకు లభిస్తుంది. వీటితో పాటు Jio TV, Jio Cinema, Jio Cloud Subscriptions ఫ్రీగా లభించనన్నాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజుల పాటు ఉంటుంది.📱💸 

bottom of page