top of page

యాత్ర 2 రివ్యూ - వైఎస్ జ‌గ‌న్ పొలిటిక‌ల్ జ‌ర్నీని ఎలా చూపించారంటే?🎥🎞️

యాత్ర సినిమాతో 2019లో ఆకట్టుకున్నారు దర్శకుడు మహి వి రాఘవ్. ఇప్పుడు 2024లో మరోసారి ఈ సినిమా సీక్వెల్‌తో వచ్చారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి యాత్రను చూపిస్తే.. ఇప్పుడు జగన్‌ను హైలైట్ చేస్తూ ఆయన చేసిన పాదయాత్రను చూపించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది.. మరోసారి యాత్ర మాదిరే ఎమోసనల్‌గా మాయ చేసారా లేదా పూర్తి రివ్యూలో చూద్దాం..🎥🎞️

యాత్ర 2 నటీనటులు: మమ్ముట్టి, జీవా, మహేష్ మంజ్రేకర్, సుజానే బెర్నర్ట్, శుభలేక సుధాకర్, రాజీవ్ కుమార్ అనేజా తదితరులు ఎడిటర్: శ్రవణ్ కటికనేని సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫర్: మధి నిర్మాతలు: శివ మేక, మహి వి రాఘవ్ దర్శకుడు: మహి వి రాఘవ్

యాత్ర 2 మూవీ రివ్యూ; యాత్ర 2ను కేవలం ఓ సినిమా లవర్‌గా మాత్రమే చూసే వాళ్ళకు ఈ సినిమా బాగానే అనిపిస్తుంది. అక్కడున్నది జగనా.. చంద్రబాబా అనేది పక్కనబెడితే.. మహి వి రాఘవ్ మరోసారి కథ చెప్పడానికి ఎమోషన్‌నే నమ్ముకున్నాడు. ఫస్ట్ సీన్ నుంచే ఈ మ్యాజిక్ చూపించడం మొదలుపెట్టాడు మహి. అందులో భాగంగానే ఓ చెవిటి అమ్మాయికి ఆపరేషన్ చేయించడం.. ఓ అంధుడిని చేరదీసి మాట్లాడటం ఇవన్నీ బాగానే వర్కవుట్ అయ్యాయి. మమ్ముట్టి ఉన్న సీన్స్ అన్నీ మరోసారి హైలైట్ అయ్యాయి. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఉన్నది కాసేపే అయినా.. మరోసారి ఎమోషన్ అద్భుతంగా పండింది. అలాగే జగన్ ఎపిసోడ్స్ మొదలైన తర్వాత కూడా స్పీడ్ ఎక్కడా తగ్గలేదు. డిల్లీ నుంచి ఎదురయ్యే సవాళ్లు.. రాష్ట్రంలోని సమస్యలు.. ఎన్ని మీదకు వస్తున్నా.. ఒక్కడే ముందుకెళ్లాడు అని చూపించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. యాత్ర రేంజ్‌లో ఇందులో ఎమోషన్ అయితే కచ్చితంగా పండలేదు. అందులో రాజశేఖర్ రెడ్డి ఎందుకు పాదయాత్ర చేసాడు.. దాని వెనక కారణాలేంటి.. అనే ఓ విశ్లేషణాత్మకంగా ముందుకు సాగుతుంది కథ.. అందుకే అంతగా కనెక్ట్ అయింది. ఇందులో ఎమోషన్స్ కంటే ఎక్కువగా పాలిటిక్స్ కనిపించాయి. ఒకరిపై ఒకరు యుద్దం.. ఒక్కడిపై అందరూ చేసే కుట్రలు.. ఇవే ఎమోషన్స్‌ను డామినేట్ చేసినట్లు అనిపించాయి. ఇక డైలాగ్స్ అయితే నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి.. ఎలివేషన్ సీన్స్ కూడా అదిరిపోయాయి. యాత్రలో కూడా రాజకీయ వ్యంగ్యాస్త్రాలు ఉన్నా.. డైరెక్ట్ హిట్టింగ్‌గా మాత్రం ఉండదు. కానీ ఇందులో అలా కాదు.. అంతా కలిసి ఒక్కరిని టార్గెట్ చేస్తున్నారు.. నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్లు చూపించారు. జగన్ జీవితంలో జరిగిన నాటకీయ పరిణామాలకు మరింత సినిమాటిక్ టచ్ ఇచ్చాడు దర్శకుడు మహి. కథా పరంగా చంద్రబాబు, సోనియా గాంధీ లాంటి కారెక్టర్స్‌ను ఓ రకంగా విలన్లుగానే చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. అయితే విలన్ అని చెప్పడం కంటే.. రాజకీయం కోసం ఏదైనా చేసే ఫక్తు పొలిటికల్ గేమ్ ఇందులో చూపించాడు దర్శకుడు. అదే సమయంలో జగన్‌ను ప్రతీ విషయంలోనూ నిజాయితీ పరుడిగానే చూపించాడు. ఓ వ్యక్తి తనకు ఎదురైన కఠిన పరిస్థితులను ఎదుర్కొని అనుకున్న లక్ష్యం ఎలా సాధించాడనేది ఇందులో ఫోకస్ చేసాడు. అది బలంగా చూపించే ప్రయత్నం చేసాడు.. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా. 🎥🎞️

bottom of page