సైకో కిల్లర్ కథలు తెలుగు ఇండస్ట్రీకి కొత్త కాదు.ఇప్పటికే ఎన్నో సినిమాలు ఇదే ఫార్మేట్ లో వచ్చాయి.అయితే ఇలాంటి సినిమాల్లో కొత్త కథ అంటూ ఉండదు. ఉన్న కథను ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అన్నట్టు తెరకెక్కిస్తే ప్రేక్షకులు ఎంగేజ్ అవుతారు.
సైకో కిల్లర్ కథలు తెలుగు ఇండస్ట్రీకి కొత్త కాదు. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఇదే ఫార్మేట్ లో వచ్చాయి. అయితే ఇలాంటి సినిమాల్లో కొత్త కథ అంటూ ఉండదు. ఉన్న కథను ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అన్నట్టు తెరకెక్కిస్తే ప్రేక్షకులు ఎంగేజ్ అవుతారు. ఈ విషయంలో గాడ్ సినిమా దర్శకుడు అహ్మద్ పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదని చెప్పాలి. ఆల్రెడీ తెలిసిన కథనే ఇంకాస్త రొటీన్ స్క్రీన్ ప్లేతో చెప్పాడు అహ్మద్. నగరంలో ఒక సైకో ఉంటాడు.. అమ్మాయిలను కిడ్నాప్ చేసి చంపేస్తూ ఉంటాడు.. అది కేవలం అతడి ఆనందం కోసం మాత్రమే.. చనిపోయే ముందు అమ్మాయిలు పెట్టే కేకలు అతనికి చాలా సంతోషాన్ని ఇస్తాయి.. కాబట్టి ఎలాంటి మోటో లేకుండా వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. అతన్ని పట్టుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తూ ఉంటారు. వినడానికి చాలా సింపుల్ కథ ఇది. కానీ దీన్ని అద్భుతంగా స్క్రీన్ మీదకు తీసుకురావచ్చు. ఫస్ట్ ఆఫ్ వరకు అహ్మద్ ఈ పని విజయవంతంగా పూర్తి చేశాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా గాడ్ రూపొందించాడు. మరీ ముఖ్యంగా ఫస్ట్ సీన్ లోనే కిల్లర్ ఎవరో చూపించడం అనేది దర్శకుడు స్క్రీన్ ప్లే చాతుర్యానికి నిదర్శనం. ఆ తర్వాత కూడా కథను ఆసక్తికరంగానే ముందుకు నడిపాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. కానీ కీలకమైన సెకండాఫ్ మాత్రం పూర్తిగా వదిలేశాడు. దర్శకుడు అప్పటికే కథ మొత్తం తెలిసిపోవడం.. విలన్ ఎవరో గెస్ చేయడంతో క్లైమాక్స్ వరకు కథ మెల్లగా సాగుతుంది. ఎండింగ్ కాస్త ఆసక్తి క్రియేట్ చేసినా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ మాత్రం కాదు. జయం రవి, నయనతార మధ్య సన్నివేశాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అసలు ఈ సినిమాలో నయనతార లాంటి పెద్ద హీరోయిన్ అవసరం లేదు. ఆమె క్యారెక్టర్ కూడా ఏదో ఉంది అంటే ఉంది. ఓవరాల్ గా గాడ్ సినిమా థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు కొంతమేర నచ్చుతుంది.🎞️🎥