top of page

🔥 త్వరలోనే జైలర్ మూవీ సీక్వెల్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూపర్ స్టార్.! 🌟

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ ఓ సాలిడ్ హిట్ అందుకున్నారు.

నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాదు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. జైలర్ సినిమా ఏకంగా 700కోట్లకు పైగా వసూల్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బీస్ట్ సినిమా తర్వాత జైలర్ సినిమాతో హిట్ కొట్టాలన్న కసిమీద పని చేశాడు. అనిరుధ్ అందించిన సంగీతం జైలర్ సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. మొత్తంగా జైలర్ సినిమా సూపర్ స్టార్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 🎉

ఇదిలా ఉంటే జైలర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోందని కోలీవుడ్ లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వేటయన్ అనే సినిమా చేస్తున్నారు రజిని. అలాగే లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇక వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే జైలర్ సినిమాకు సీక్వెల్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. జైలర్ సీక్వెల్ కు ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్, అనిరుధ్, నెల్సన్ దిలీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారని కోలీవుడ్ లో వినిపిస్తున్న టాక్. 🎬

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page