top of page

వైసీపీ వివాదంపై జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

ఇటీవల రజనీకాంత్ చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయిన క్రమంలో ఈ అంశం మీద జగపతి బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.

Jagapathi Babu about Rajinikanth vs YSR Congress Controversy : గత కొద్దిరోజులుగా రజినీకాంత్ అనే పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి ఎన్ఠీఆర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమానికి కమిటీ ఆహ్వానం మేరకు సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు. అయితే రజినీకాంత్ హాజరై ఎన్టీఆర్ తో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకోవడం మాత్రమే కాదు ఎన్టీఆర్ అల్లుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ప్రశంసల వర్షం కురిపించారు.చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్ అని పేర్కొన్న రజనీకాంత్ ఎవరినీ విమర్శలు చేయకుండానే చంద్రబాబు విజనరీ కాబట్టి ఆయనని గెలిపించాల్సిన బాధ్యత ఉంది అనే విధంగా మాట్లాడారు. అయితే ఈ విషయాన్ని అధికార వైసీపీ చాలా సీరియస్ గా తీసుకుంది, వైసీపీ ప్రభుత్వాన్ని కానీ పార్టీని కానీ రజనీకాంత్ ఏమీ అనకపోయినా ఆ పార్టీకి చెందిన కీలక నేతలు మంత్రులు, కొందరు రజనీకాంత్ ని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు వెన్నుపోటుదారుడు ఆయన వెన్నుపోటు పొడిచినప్పుడు వైస్రాయ్ హోటల్ లో కూడా రజనీకాంత్ ఉన్నారు అంటూ అప్పటి విషయాల్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే రజనీ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన హీరో మీద జరుగుతున్న దాడిని చూసి తట్టుకోలేక వారు కూడా పెద్ద ఎత్తున వైఎస్ జగన్ ని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. ఇక ఇదే అంశం మీద తాజాగా చంద్రబాబు కూడా రజనీకాంత్ కు ఫోన్ చేసి వాళ్లు అంటున్న మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈ విషయాన్ని తాను ఖండిస్తున్నానని చెప్పుకొచ్చారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page