top of page
Shiva YT

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..🌟🎉

ప్రధానంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ జరిగింది. డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్‌లపై చర్చించారు. దాదాపు 6 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు. అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఫారెస్ట్‌ రేంజర్‌ ఆఫీసర్లు సహా వివిధ పోస్టుల భర్తీ చేయనున్నారు.

కేబినెట్ నిర్ణయాలు ఇవే… — డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌, 6100 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం — ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు — ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5 వేల కోట్ల మేర నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ — అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం — ఫిబ్రవరిలో అమలు చేసే పలు సంక్షేమ పథకాలకు ఆమోదం — YSR చేయూత నిధుల విడుదలకు ఆమోదం తెలిపిన కేబినెట్ — మేనిఫెస్టోలో హామీ మేరకు వరుసగా నాలుగో విడత YSR చేయూత అమలు — ప్రతి గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా పంచాయితీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం — 500 లోపు జనాభా ఉన్న పంచాయతీలకూ సెక్రటరీల నియామకం — యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు — ఇంధన రంగంలో రూ.22 వేల కోట్లకుపైగా పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం ఆమోదం –ఎక్రోన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1350 కోట్లు పెట్టుబడి ప్రతిపాదనను మంత్రివర్గం — 3350 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ కు ఆమోదం — న్యాయవాదుల సంక్షేమ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం — ఏపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లెజిస్లేచర్‌ స్టడీస్‌ అండ్‌ ట్రైనింగ్‌ సంస్థ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం –అసైన్డ్‌ భూముల మార్పిడి నిషేధ చట్ట సవరణ బిల్లుకు అంగీకారం — డిజిటల్ ఇన్‌ఫ్రా కంపెనీని రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం — సీఎం కుటుంబ భద్రతకు ఏర్పాటు చేసే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్‌లో 25 మంది హెడ్‌ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అంగీకారం — పాఠశాల విద్యాశాఖలో ఇతర ఖాళీలను పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయం — డిస్కంలకు రూ.1500 కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకు హామీకి మంత్రివర్గం ఆమోదం 🌐

bottom of page