ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(YS Jagan) విదేశాలకు (Abroad) వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టు(CBI Court) లో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జగన్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరింది. దీంతో జగన్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. మరోవైపు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) కూడా పిటిషన్‌పై వాదనలు పూర్తి కాగా ఈ నెల 30కి తీర్పు వాయిదా వేశారు. సెప్టెంబర్‌లో యూకే(UK) వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్, సెప్టెంబర్, అక్టోబర్‌లో యూరప్ వెళ్లేందుకు విజయసాయిరెడ్డి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మే 13న ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం జగన్15 రోజుల పాటు కుటుంబంతో కలిసి జగన్ విదేశీ ప్రయాణం చేశారు. ఈ మేరకు జగన్ విదేశీ పర్యటన వెళ్లేందుకు నాంపల్లి సీబీఐ కోర్టు కొన్ని ఆంక్షలు విధిస్తూ అనుమతి ఇచ్చింది. యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో జగన్ పర్యటించారు. ఏపీలో ఓటమి తరువాత వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లడం ఇదే ప్రథమం.