top of page
Shiva YT

ఏపీ మహిళలకు జగన్ సర్కారు కానుక.. ఒక్కొక్కరి ఖాతాలోకి ఏకంగా లక్షన్నర 🌟💰

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతూ.. రాష్ట్రంలోని పేదలందరికీ న్యాయం జరిగేలా నిధులు విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. 💑💵

YSR కళ్యాణమస్తు, YSR షాదీ తోఫా పథకం కింద పేదింటి ఆడపిల్లల పెళ్లికి జగన్ ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన మరిన్ని నిధులను ఈ రోజు (ఫిబ్రవరి 20)న విడుదల చేయబోతున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. 💼🎉

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి YSR షాదీ తోఫా నిధులను పెళ్లి కూతురు తల్లుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు సీఎం. 2023 సంవత్సరం అక్టోబర్ నెల నుంచి డిసెంబర్ నెల మధ్య కాలంలో పెళ్లి చేసుకున్న జంటలకు ఈ ఆర్థిక సాయం అందనుంది. 💍💸

YSR కళ్యాణమస్తు, YSR షాదీ తోఫా పథకంలో భాగంగా మొత్తంగా 10,132 జంటలకు రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ విడుదల చేయనున్నారు. పేద ప్రజలు ఎప్పటి నుంచో ఈ నిధుల కోసం ఎదురు చూస్తుండగా.. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో అంతా ఖుషీ అవుతున్నారు. 😊💰

పేద ప్రజల పిల్లలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగన్ పలు పథకాలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడ పిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల ద్వారా ఈ ఆర్థిక సాయం అందిస్తున్నారు. 💑💼

పేద ప్రజల పిల్లలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగన్ పలు పథకాలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడ పిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల ద్వారా ఈ ఆర్థిక సాయం అందిస్తున్నారు. 💑💼

ఎస్సీ లబ్ధిదారులకు లక్ష రూపాయలు, అదేవిధంగా ఎస్సీలలో కులాంతర వివాహం చేసుకున్న వారికి రూ. 1,20,000 ఇవ్వబోతున్నారు. ఎస్టీ లబ్ధిదారులకు రూ. 1,00,000, అదేవిధంగా ఎస్టీలలో కులాంతర వివాహం చేసుకున్న వారికి రూ. 1,20,000 అందిస్తున్నారు. 💵💍

బీసీల్లో అర్హులైన లబ్ధిదారులకు రూ. 50,000, అదేవిధంగా బీసీల్లో కులాంతర వివాహం చేసుకున్న వారికి రూ.75 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. మైనార్టీలు, దూదేకుల సామాజిక వర్గాల్లోని లబ్ధిదారులకు ఈ పథకం కింద రూ.1,00,000 ఆర్థిక సాయం ఇస్తున్నారు. 💵👰

పేద పిల్లలైనప్పటికీ ఈ పథకాల ద్వారా లబ్ధి చేకూరాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. వధూవరులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత కావటం అర్హతగా పెట్టాడనే గాక.. పెళ్లి నాటికి వధువు కనీస వయస్సు 18 ఏళ్ళు, వరుడి కనీస వయస్సు 21 ఏళ్ళు ఉండాలని కండీషన్స్ పెట్టారు. 🎓👩‍🎓

అందరూ విద్యావంతులు కావాలనే లక్ష్యంతో పాటు.. బాల్య వివాహాలను నివారించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోంది. ఈ రెండు పథకాల ద్వారా ఇప్పటి వరకు 56,194 మందికి లబ్ధి చేకూరగా.. ఇప్పుడు మరింత మంది లబ్ది దారులు యాడ్ కానున్నారు. 📚📖

bottom of page