top of page
MediaFx

40% ఓట్లు వచ్చాయన్న విషయం మరిచిపోవద్దు

వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 2019లో 151 సీట్లలో గెలుపొందిన ఆ పార్టీ.. ఐదేళ్లు తిరిగేసరికి 11 సీట్లకు పడిపోయింది. ఓటమి వెనుక కారణాలను విశ్లేషించేందుకు తాడేపల్లిలోని కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులతో జగన్ భేటీ అయ్యారు. మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేసినా, వచ్చిన ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయని జగన్ అన్నారు. 2.7 లక్షల కోట్ల మందికి డీబీటీ ద్వారా లబ్ధి చేకూర్చామన్నారు. అంతమంది ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియలేదన్నారు. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు ఉన్నాయని అన్నారు. అయినప్పటికీ 40% ఓట్లు పడ్డాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈవీఎంల గురించి ఆధారాలు లేకుండా మాట్లాడలేమన్నారు. వయసుతో పాటు పోరాడే సత్తా తనకుందన్నారు.

చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను ప్రజలు త్వరలోనే గుర్తిస్తారన్నారు. 2029లో తిరిగి వైసీపీని ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, వారికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత నాయకులదేనని జగన్ గుర్తుచేశారు. ఓడిపోయామన్న బాధ మనసులోంచి తీసేయండి, ప్రతి కార్యకర్తకు అండగా ఉండండని సూచించారు.

అసెంబ్లీ సమావేశాలపైనా స్పందించారు జగన్. సంఖ్యాబలం తక్కువ కారణంగా సభకు వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండదని, అంతకంటే ప్రజల్లోకి వెళ్లి పోరాటాలు చేయడం బెటర్ అని సూచించారు. కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చి, ఆ తర్వాత హామీల అమలుపై నిలదీసే కార్యక్రమాలుంటాయని క్లారిటీ ఇచ్చారు.

bottom of page