🐟 చేపల పులుసు బిజినెస్‌తో బిజిబిజీగా ఉన్న కిర్రాక్ ఆర్పీ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన, హడావిడి లేకుండా ఎంతో గోప్యంగా. గతేడాది నిశ్చితార్థం చేసుకున్న లక్ష్మీ ప్రసన్న మెడలో మూడు ముళ్లు వేశాడు ఆర్పీ.
బుధవారం (నవంబర్ 29న) విశాఖపట్నం వేదికగా వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. కేవలం ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, సన్నిహితులు మాత్రమే ఆర్పీ పెళ్లికి హాజరయ్యారు. ప్రస్తుతం వీరి జంటకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. జబర్దస్త్ కమెడియన్లు, సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కిర్రాక్ ఆర్పీ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
🏖️ లక్ష్మీ ప్రసన్నది విశాఖపట్నం. గతేడాది మా ఎంగేజ్‌మెంట్ జరిగింది. మేము ప్రేమించుకున్నాం. పెద్దలను ఒప్పించే ఈ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నిశ్చితార్థం, ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఇతర వీఐపీలు హాజరయ్యారు. అందుకే ఈసారి కేవలం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఇందుకు వైజాగ్‌ను వేదికగా ఎంచుకున్నాం. పెళ్లి విషయాన్ని కూడా గోప్యంగా ఉంచాం’ అని ఆర్పీ చెప్పుకొచ్చాడు. కాగా గతడాది మేలో ఆర్పీ- లక్ష్మీల నిశ్చితార్థం జరిగింది. అప్పుడు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. 🎉