top of page

🔍 తమిళనాట ఐటి దాడుల కలకలం.. 🧐 రీజన్ ఇదేనంటున్న డీఎంకే..

👉 డీఎంకే నేతల అక్రమాలు అంటూ సీజన్..1 సీజన్ 2 అంటూ అక్రమార్కుల జాబితా మీడియాకు రిలీజ్ చేశారు 📜📺 బిజెపి తమిళనాడు చీఫ్ అన్నామలై. ఇందులో సీఎం స్టాలిన్ కుటుంబ సభ్యులే ఎక్కువగా ఉండడం గమనార్హం. 😮

ఇలా అన్నామలై లిస్ట్ విడుదల చేస్తూపోతూ ఉంటే ఐటి, ఈడీ అధికారులు అలా సోదాలు మొదలు పెడుతూ ఉన్నారు 🕵️‍♂️. ఆ తర్వాత అరెస్టులు చేస్తూ ఉన్నారు 🚔. అన్నామలై విడుదల చేసిన జాబితాలో ఆరోగ్య శాఖమంత్రి త్యాగరాజన్ స్టాలిన్ అల్లుడు సబరీశన్ తో మాట్లాడిన ఆడియో 🗣️. లావాదేవీలకు సంబంధించిన వివరాలను బయట పెట్టారు 📢. మంత్రి సెంథిల్ బాలాజీ, ఆ వెంటనే మరో మంత్రి పొన్ముడి, అతని కుమారుడు ఎంపి శిగామని లపై ఐటి, ఈడీ దాడులు చేయడం.. ఇప్పటికే సెంథిల్ బాలాజీ అరెస్టు.. త్వరలో మరికొన్ని అరెస్టులు తెప్పేలా లేవు 🏃‍♂️.

📢 ఇప్పటివరకు బిజెపి టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేసి బయటపెట్టిన లిస్ట్ లోని నేతలందరూ డీఎంకే లో అత్యంత ముఖ్యనేతలు 🎯. ఆర్ధికంగా పార్టీకి అన్ని విధాలా అండగా ఉండే నేతలే ఇలా టార్గెట్ కావడం డీఎంకే లో కూడా కలవరం రేపుతోంది 🎉. తాజాగా మాజీ కేంద్రమంత్రి డీఎంకే ఎంపీ జగద్రక్షకన్ నివాసం, సంస్థలు కార్యాలయాలపై సోదాలు మరోసారి కలకలం రేపాయి 🏨🏥🏢.

🤔 జగద్రక్షకన్ కు చెందిన హోటల్స్, హాస్పిటల్స్, కార్యాలయాలు, ఆయన సన్నిహితుల ఇళ్లపై సోదాలు జరుగుతున్నాయి 🏨🏥🏢. డీఎంకే లో ఇప్పటివరకు సోదాలు ఎదుర్కొన్న నేతలందరూ ఆపార్టీకి ఆర్ధికంగా అండగా ఉన్న వారు కావడం విశేషం 🏦. వచ్చే ఎన్నికల్లో డీఎంకే విజయాన్ని కట్టడి చేసేందుకు బిజెపి ప్రయోగిస్తున్న అస్త్రమే ఐటి అంటూ ఆరోపిస్తోంది డీఎంకే. డీఎంకే తప్పులను సైతం తమపై రుద్దుతోందని అంటోంది బిజెపి. మరి వరుస ఐటి దాడులు ఎవరికి అనుకూలం.. ఎవరికి ప్రతికూలం చూడాలి మరి. 💭🤷‍♂️🗳️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page